నీరొచ్చి పాడవుతున్నాయా!

అప్పటికప్పుడు తాజాగా కూరగాయల్ని కోసుకొచ్చి వండే రోజులు కావివి. కనీసం మార్కెట్‌ నుంచి కూడా ఏ రోజుకారోజు తెచ్చుకోలేం. అందుకే, వారానికోసారి మార్కెట్‌ నుంచి కొనుక్కురావడం, ఒక రోజు ముందే కట్‌ చేసుకుని బాక్సుల్లో సర్దుకోవడం వంటి పనులు ఇప్పుడు అందరి జీవితాల్లోనూ ఓ భాగం అయిపోయాయి.

Published : 09 Jul 2023 00:24 IST

ప్పటికప్పుడు తాజాగా కూరగాయల్ని కోసుకొచ్చి వండే రోజులు కావివి. కనీసం మార్కెట్‌ నుంచి కూడా ఏ రోజుకారోజు తెచ్చుకోలేం. అందుకే, వారానికోసారి మార్కెట్‌ నుంచి కొనుక్కురావడం, ఒక రోజు ముందే కట్‌ చేసుకుని బాక్సుల్లో సర్దుకోవడం వంటి పనులు ఇప్పుడు అందరి జీవితాల్లోనూ ఓ భాగం అయిపోయాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా భద్రపరచడమే ఓ పెద్ద సవాల్‌. వీటిని ముక్కల్లా కత్తిరించి స్టోర్‌ చేసినా, నేరుగా కూరగాయల్ని ఫ్రిజ్‌లో పెట్టాలనుకున్నా తేమ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే వాటిల్లో నీరూరి పాడయిపోతుంటాయి. మీకూ ఇలాంటి అనుభవముందా అయితే ఈ సారి ఇందుకోసం డ్రెయిన్‌ స్టోరేజ్‌ బాక్సుల్ని ఎంచుకోండి. రకరకాల పరిమాణాల్లో దొరుకుతున్నాయి. ఈ బాక్సుల్లో ఉండే జాలీ నుంచి నీళ్లు అడుగుకి చేరడం వల్ల కూరగాయలూ, పండ్లూ ఏ మాత్రం పాడవ్వవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని