వీటిని అవెన్‌లో వేడి చేయొద్దు
మిగిలిన పదార్థాలు నిలవ చేసుకోవడానికి ఫ్రిజ్.. వాటిని తిరిగి వేడి చేసుకోవడానికి అవెన్ ఉన్నాయి. కానీ కొన్నిటిని అవెన్‌లో వేడి చేయొద్దని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మిగిలిన పదార్థాలు నిలవ చేసుకోవడానికి ఫ్రిజ్.. వాటిని తిరిగి వేడి చేసుకోవడానికి అవెన్ ఉన్నాయి. కానీ కొన్నిటిని అవెన్‌లో వేడి చేయొద్దని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటంటే...
- పుట్టగొడుగులను (మష్రూమ్స్) తిరిగి వేడి చేస్తే అందులో ఉన్న పోషకాలు నశించడమే కాదు, ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయి.
- ఉడికించిన కోడిగుడ్లు, చిల్లీ పెప్పర్స్, బ్రొకోలి, అవెన్‌లో వేడిచేస్తే అవి హానికరంగా తయారవుతాయి.
- అన్నం మిగిలితే.. రెండోరోజు అలాగే తినొచ్చు. అవెన్‌లో వేడి చేస్తే మాత్రం విషతుల్యమౌతుంది.
- నైట్రేట్లు విస్తారంగా ఉన్న బీట్‌రూట్, క్యారెట్, బచ్చలికూర లాంటివి అవెన్‌లో వేడి చేయకూడదు.
- ఉద్యోగినులు చనుబాలు భద్రం చేసి, బిడ్డకు ఆకలేసినప్పుడు తాగించే ఏర్పాటు చేస్తున్నారు. ఆ పాలు అవెన్‌లో వేడి చేయడం మంచిది కాదు. అవసరాన్ని బట్టి వేడినీళ్ల గిన్నెలో పాలపాత్రను ఉంచి గోరువెచ్చగా చేయొచ్చు.
- ఫ్రిజ్‌లో ఉంచిన పండ్లు చల్లగా ఉన్నాయని కొన్ని క్షణాలు కూడా అవెన్‌లో వేడి చేయకూడదు.
- కాఫీ వెంటనే తాగాలి. చల్లారిందని వేడి చేయకూడదు.
- ఉడికించిన బంగాళదుంపలు, ప్రాసెస్ చేసిన మాంసం, టొమాటో సాస్ అవెన్‌లో వేడి చేయకూడదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bihar Caste survey: బిహార్‌లో ఓబీసీ, ఈబీసీలే 63%.. కులగణన సర్వేలో వెల్లడి
-
Harish Rao: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. హ్యాట్రిక్ కొట్టేది సీఎం కేసీఆరే: మంత్రి హరీశ్
-
Amazon River: అమెజాన్ నదిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. వందకుపైగా డాల్ఫిన్ల మృత్యువాత
-
DL Ravindra Reddy: తెదేపా, జనసేనకు 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు: డీఎల్
-
Salaar: ‘సలార్’ ఆ సినిమాకు రీమేక్..? ఈ రూమర్‌కు అసలు కారణమిదే!
-
PM modi: గహ్లోత్‌కు ఓటమి తప్పదని అర్థమైంది: మోదీ