ప్రధాని మోదీ ఇష్టపడే పండ్లు

ఎరుపు, నారింజ రంగుల్లో బెర్రీ పండ్లను తలపించే పహాడీ (కఫల్‌) పండ్లు అందంగా, ఆకర్షణీయంగా, నోరూరించేలా ఉంటాయి. మన ప్రధాని వీటికి వీరాభిమాని అని తెలిసిన ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఇటీవల పహాడీ పండ్లను నరేంద్రమోదీకి కానుకగా పంపారు.

Published : 16 Jul 2023 00:19 IST

వహ్వా

ఎరుపు, నారింజ రంగుల్లో బెర్రీ పండ్లను తలపించే పహాడీ (కఫల్‌) పండ్లు అందంగా, ఆకర్షణీయంగా, నోరూరించేలా ఉంటాయి. మన ప్రధాని వీటికి వీరాభిమాని అని తెలిసిన ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఇటీవల పహాడీ పండ్లను నరేంద్రమోదీకి కానుకగా పంపారు. వాటిని చూస్తూనే మోదీ ముఖం వికసించగా.. ఉత్తరాఖండ్‌ సంస్కృతిలో పహాడీ పండ్ల ప్రాముఖ్యత గురించి చెబుతూ ఆ ప్రాంత జానపద గీతాల్లోనూ వీటి ప్రస్తావన ఉందంటూ గుర్తుచేసుకున్నారు. సముద్రానికి ఆరు వేల ఎత్తులో ఉన్న కాప్‌కోట్‌, ఘింగ్‌హర్టోలా, గుణకోట్‌, నార్గోల్‌, గిరేచినా తదితర ఉత్తరాఖండ్‌ అటవీ ప్రాంతాల్లో వర్షాకాలంలో మాత్రమే పండుతాయివి. అందుకే అందరికీ అందుబాటులో ఉండవు. ఈ అరుదైన పండ్ల ధర కిలో మూడొందలు. తియ్యటి తీపికి కాస్తంత పులుపు జోడించినట్లుగా మహత్తరంగా ఉండే ఈ కఫల్‌ పండ్లు రుచికి అమోఘం, ఆరోగ్యపరంగా ఔషధం. ఖనిజాలు, పీచు విస్తారంగా ఉన్నందున ఊబకాయం రాదు. జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఉత్తరాఖండ్‌ వెళ్లినవారు పహాడీ పండ్లు తినకుండా రారు. అటు వెళ్తే మీరూ ప్రయత్నించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని