చల్ల చల్లగా.. కూల్‌ కూల్‌గా..

తాగుతామో.. పండ్ల రసాలు అంత చల్లగా ఇష్టపడతాం. ఆ చల్లదనం కోసమే పానీయాల్లో ఐస్‌ క్యూబ్స్‌ వేసుకుంటాం. అలాంటి క్యూబ్స్‌ కోసం పోర్టబుల్‌ ఐస్‌ బాల్‌ మేకర్‌ వచ్చింది

Updated : 12 Nov 2023 03:55 IST

కాఫీ ఎంత వేడిగా పొగలొచ్చేలా తాగుతామో.. పండ్ల రసాలు అంత చల్లగా ఇష్టపడతాం. ఆ చల్లదనం కోసమే పానీయాల్లో ఐస్‌ క్యూబ్స్‌ వేసుకుంటాం. అలాంటి క్యూబ్స్‌ కోసం పోర్టబుల్‌ ఐస్‌ బాల్‌ మేకర్‌ వచ్చింది. ఇందులో చక్కటి ఐస్‌ బాల్స్‌ తయారయ్యే ట్రేతో పాటు.. వాటర్‌ బాటిల్‌ కూడా ఉంది. బయటకు వెళ్లేటప్పుడు దీన్ని తీసుకెళ్తే చాలాసేపు చల్లదనం నిలుస్తుంది. ఫ్రీజర్‌లో ఎంత ఘాటైన వాసనలు ఉన్నా బాటిల్‌కు తాకకపోవడం దీని ప్రత్యేకత. పీసీ మెటీరియల్‌తో తయారైన ఈ సాధనం ఎక్కువ కాలం మన్నుతుంది. దీన్ని డిష్‌వాషర్‌తో శుభ్రం చేయడమూ తేలికే. ఇది వేడి నీళ్లు నిలవ చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని