నేరేడు లాంటి అకాయ్‌!

బెర్రీస్‌లో అనేక రకాలున్నాయి. అందులో ఒకటి అకాయ్‌ బెర్రీ. నేరేడు పండ్లలా ఉండే వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ముడతలు పడదు, కాంతిమంతంగా ఉంటుంది.

Published : 14 Apr 2024 00:11 IST

బెర్రీస్‌లో అనేక రకాలున్నాయి. అందులో ఒకటి అకాయ్‌ బెర్రీ. నేరేడు పండ్లలా ఉండే వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ముడతలు పడదు, కాంతిమంతంగా ఉంటుంది. కురులు ఆరోగ్యంగా ఉంటాయి. ఊబకాయం రాదు. డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. కంటిచూపు బాగుంటుంది. దంతాలకు దృఢత్వం వస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ పండ్లు అమెజాన్‌ అడవుల్లో విస్తారంగా పండుతాయి. బ్లాక్‌ బెర్రీస్‌ రుచితో ఉండే ఈ అకాయ్‌ బెర్రీస్‌తో స్మూథీస్‌, జ్యూస్‌ చేస్తారు. వీటిని కోసిన వెంటనే తినాలి. లేదా ఎండబెట్టడమో, ఫ్రీజర్‌లో ఉంచడమో చేయాలి. లేదంటే పాడైపోతాయి. మనదేశంలో కేరళలో వీటిని పండిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని