ఇలా కూడా చేస్తారు!

షర్బత్‌ చేయాలంటే నిమ్మకాయలను సగానికి కోసి రసం తీసి, పంచదార వేస్తాం. రసం తీసేటప్పుడు నిమ్మచెక్కల లోంచి చేదు దిగకుండా జాగ్రత్తపడతాం. ఇది మనందరికీ తెలిసిన పద్ధతి.

Published : 13 Aug 2023 00:59 IST

షర్బత్‌ చేయాలంటే నిమ్మకాయలను సగానికి కోసి రసం తీసి, పంచదార వేస్తాం. రసం తీసేటప్పుడు నిమ్మచెక్కల లోంచి చేదు దిగకుండా జాగ్రత్తపడతాం. ఇది మనందరికీ తెలిసిన పద్ధతి. కానీ అంతకంటే సునాయాసంగా చేయడం ఎలాగో తెలుసా.. మిక్సీజార్‌లో రెండు గ్లాసుల నీళ్లు, ఆరు చెంచాల పంచదార, రెండు నిమ్మకాయలు యథాతథంగా వేసి గ్రైండ్‌ చేసి వడకడితే చాలు షర్బత్‌ తయారైపోతుంది. కానీ.. చేదుగా ఉండదా అనిపిస్తోంది కదూ! జిహ్వకో రుచి అంటారుగా! కొందరికి అలా నచ్చుతుంది కాబోలు. ప్రముఖ హిందీ నటి నీనా గుప్తా తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. ఆసక్తికరమైన విశేషాలు ఏమైనా గమనిస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. ఇటీవల కేరళ పర్యటనలో ఒక స్ట్రీట్‌ వెండర్‌ ఇలా షర్బత్‌ తయారుచేయడాన్ని చూసి.. ‘ఇదెంతో సులువు కదా!’ అంటూ నలుగురితో పంచుకున్నారామె. నచ్చితే మీరూ ప్రయత్నించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని