తింటే చాలు.. సెంటు వాసనే!
దానిమ్మ, ద్రాక్ష, యాపిల్, బొప్పాయి.. ఇలా పండ్లలో బోలెడన్ని రకాలున్నాయి. వాటన్నిటికీ భిన్నమైంది పర్‌ఫ్యూమ్ ఫ్రూట్. సెంటులా పరిమళిస్తుంది కనుక ఆ పేరుతో పిలుస్తున్నారు.
దానిమ్మ, ద్రాక్ష, యాపిల్, బొప్పాయి.. ఇలా పండ్లలో బోలెడన్ని రకాలున్నాయి. వాటన్నిటికీ భిన్నమైంది పర్‌ఫ్యూమ్ ఫ్రూట్. సెంటులా పరిమళిస్తుంది కనుక ఆ పేరుతో పిలుస్తున్నారు. వాసన సరే.. రుచి ఎలా ఉంటుందంటారా? అరటిపండు, పైనాపిల్, లిచి, నారింజ, మామిడిపండు.. అన్నీ కలబోసినట్లుండి వహ్వా అనిపిస్తుంది. రుచీ, సువాసనా మాత్రమే కాదండోయ్.. ఈ పండు తిన్నాక శరీరం కూడా పరిమళభరితం అవుతుంది. ఆఖరికి చెమట, మూత్రం కూడా పర్‌ఫ్యూమ్ వాసనే వస్తాయి. అద్భుతమే కదూ! ఇంత ఘనమైంది కనుకనే.. ఒకప్పుడు వీటిని రాజకుటుంబీకులు మాత్రమే తినాలనే ఆంక్ష ఉండేది. సామాన్య ప్రజలు ఈ పండ్లను తినడం కాదు కదా.. పెంచడం కూడా నిషేధమే. మలేషియాలో ప్రసిద్ధమైన ఈ పండ్లను మనమూ తెచ్చుకుందామా! కొన్ని గింజలు పెరట్లో నాటామంటే.. ఇక సెంట్లూ, డియోడరెంట్లతో పనే లేదు.. ఒక్క పండు తింటే చాలు మూడు రోజుల దాకా ఒళ్లంతా పర్‌ఫ్యూమ్ రాసుకున్నట్లు ఘుమాయిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Saba Azad: హృతిక్‌తో ప్రేమాయణం.. అవి నన్నెంతో బాధించాయి: సబా ఆజాద్
-
Leo: విజయ్ ‘లియో’.. ఆ రూమర్స్ ఖండించిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ
-
Nobel Prize: కొవిడ్ వ్యాక్సిన్‌లో పరిశోధనలకు.. ఈ ఏడాది నోబెల్
-
Shubman Gill: ప్రపంచకప్‌లో గిల్ పేరిట కనీసం రెండు శతకాలు..: ఆకాశ్ చోప్రా
-
Parawada: పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు: బండారు సతీమణి ఫిర్యాదు
-
Plane Crash: జింబాబ్వేలో విమాన ప్రమాదం.. భారతీయ వ్యాపారవేత్త సహా ఆరుగురి మృతి