కీరదోస అందరికీ మంచిది..

చలవ చేసే వాటిల్లో మొదట ఉంటుంది కీరదోస. ఇందులో సోడియం, పీచు, కాపర్, పొటాషియం, మాంగనీస్, భాస్వరం, మెగ్నీషియం, ఎ, బి1, సి, కె విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయి.

Published : 09 Jun 2024 00:47 IST

లవ చేసే వాటిల్లో మొదట ఉంటుంది కీరదోస. ఇందులో సోడియం, పీచు, కాపర్, పొటాషియం, మాంగనీస్, భాస్వరం, మెగ్నీషియం, ఎ, బి1, సి, కె విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయి. 95 శాతం నీరే ఉంటుంది కనుక డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు. కీరదోస తినడం వల్ల జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. రక్తపోటు క్రమబద్ధంగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. వృద్ధులు తరచూ తినడం అలవాటు చేసుకుంటే హైపర్‌టెన్షన్‌ బారిన పడరు. బరువు తగ్గాలనుకునేవారికి ఇదెంతో ఉపయోగం. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, ముడతలు రావు. కంటిచూపు మెరుగవుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది, అల్జీమర్స్‌ బారిన పడకుండా కాపాడుతుంది. కీరదోసలోని సి-విటమిన్‌ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కె-విటమిన్‌ ఎముకలు, దంతాలకు దృఢత్వాన్ని తెస్తుంది. ఇందులో యాంటీక్యాన్సర్‌ గుణాలు ఉన్నందున క్యాన్సర్లను నివారిస్తుంది. కీరదోస పిల్లలూ, పెద్దలూ అందరికీ మంచిది. ఇందులో ఉన్న సిలికా కురులను, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇన్ని రకాలుగా మేలు చేసే కీరదోస నోటికి హితవుగానూ ఉంటుంది. దీన్ని నేరుగా తినొచ్చు, జ్యూస్, సలాడ్‌ రూపంలోనూ తీసుకోవచ్చు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని