ఇది రాజస్థాన్‌ వాళ్ల పాయసం!

ఇసుక ఎడారులు, అందాల భవనాలు అనగానే రాజస్థాన్‌ గుర్తొస్తుంది కదూ! వాళ్ల వంటకాలు కూడా ఆకట్టుకునేట్టే ఉంటాయి. వాటిల్లో ‘గెహూ కా దూధియా ఖీచ్‌’ మరీ మరీ ప్రత్యేకమైంది.

Published : 31 Mar 2024 00:07 IST

ఇసుక ఎడారులు, అందాల భవనాలు అనగానే రాజస్థాన్‌ గుర్తొస్తుంది కదూ! వాళ్ల వంటకాలు కూడా ఆకట్టుకునేట్టే ఉంటాయి. వాటిల్లో ‘గెహూ కా దూధియా ఖీచ్‌’ మరీ మరీ ప్రత్యేకమైంది. దీనికి ఏమేం కావాలంటే.. అర కప్పు గోధుమరవ్వకు అంతే మొత్తంలో పంచదార, 3 కప్పుల పాలు, చారెడు చొప్పున బాదం పలుకులు, కిస్‌మిస్‌లు, 4 యాలకులు, కొద్దిగా కుంకుమపువ్వు, చెంచా నెయ్యి అవసరమౌతాయి. తయారీ కూడా సులువే. గోధుమరవ్వలో కప్పు నీళ్లు, ఇంకో కప్పు పాలు పోసి సన్న సెగ మీద ఉడికించాలి. మందపాటి గిన్నెలో మిగిలిన రెండు కప్పుల పాలు పోసి.. దంచిన యాలకులు, బాదం పలుకులు, కిస్‌మిస్‌లు, కుంకుమపువ్వు, నెయ్యి, పంచదార వేసి కలియ తిప్పి తక్కువ సెగ మీద సుమారు పది నిమిషాలు తెర్లించాలి. అందులో ఉడికించిన గోధుమరవ్వ వేసి.. ఉండలు కట్టకుండా కలియ తిప్పుతుండాలి. చిక్కబడిన తర్వాత దించేయాలి. అందుకు ఇంకో మూడు నిమిషాలు పడుతుంది. ఈ ‘గెహూ కా దూధియా ఖీచ్‌’లో కాస్త నెయ్యి వేసుకుని వేడిగా తింటే అమృతంలా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు