నాలుగు రుచుల పండు

పాండనస్‌ టెక్టోరియస్‌ గురించి ఎప్పుడైనా విన్నారా! ఇది తాచ్‌ స్క్రూపైన్‌, తాహితీయన్‌ స్క్రూపైన్‌, హలా పేర్లతోనూ ప్రసిద్ధం. మలేషియా, తూర్పు ఆస్ట్రేలియా, పసిఫిక్‌ దీవులకు చెందిన ఈ చెట్లు 13 నుంచి 26 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి.

Updated : 04 Feb 2024 04:20 IST

పాండనస్‌ టెక్టోరియస్‌ గురించి ఎప్పుడైనా విన్నారా! ఇది తాచ్‌ స్క్రూపైన్‌, తాహితీయన్‌ స్క్రూపైన్‌, హలా పేర్లతోనూ ప్రసిద్ధం. మలేషియా, తూర్పు ఆస్ట్రేలియా, పసిఫిక్‌ దీవులకు చెందిన ఈ చెట్లు 13 నుంచి 26 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. వీటి పండ్లు పసుపు, నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో గుండ్రంగా, కోలగా ఉంటాయి. పక్వానికి వచ్చినప్పుడు మంచి వాసన వస్తాయి. మిగల పండితే మాత్రం ఘాటు వాసనతో వికారం కలిగిస్తాయి. రుచి... పనస, అనాస, మామిడిపండ్లకు చెరుకురసం జత చేసినట్లు ఉంటుంది. గుజ్జును అలాగే తినొచ్చు. లేదంటే పండ్లరసం, జామ్‌ లాంటివి చేసుకోవచ్చు. ఈ చెట్లు సాధారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతాయి. ఒక్కో పండులో 2 - 8 వరకు విత్తనాలుంటాయి. ఈ గింజలు సముద్రంలో రాలి, తేలుతూ చాలా కాలం జీవంతోనే ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని