ఆందోళన తగ్గించే రెడ్‌ డేట్స్‌

రెడ్‌ డేట్స్‌ పండ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? ఇవి ఎర్రగా, కోలగా ఉంటాయి. చూడటానికి రేగు పండ్లు, ఖర్జూరాలను పోలి ఉంటాయి.

Published : 21 Jan 2024 00:04 IST

రెడ్‌ డేట్స్‌ పండ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? ఇవి ఎర్రగా, కోలగా ఉంటాయి. చూడటానికి రేగు పండ్లు, ఖర్జూరాలను పోలి ఉంటాయి. పండ్లు ముగ్గిన కొద్దీ ముడతలు పడతాయి. ఇవి పుట్టింది చైనాలో అయినా.. ఇప్పుడు చాలా దేశాల్లో దొరుకుతున్నాయి. ఈ పండ్లను చైనీస్‌ డేట్స్‌ అని కూడా అంటారు. ఈ చెట్లు 16 నుంచి 39 అడుగుల ఎత్తు వరకూ ఎదుగుతాయి. రెడ్‌ డేట్స్‌ పండ్లను అలాగే తినొచ్చు. లేదంటే జ్యూస్‌ చేసి తాగొచ్చు. వీటిలో యాంటీ డిప్రెసెంట్‌ గుణాలు ఉండటాన.. ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. ఇవి నరాల వ్యవస్థకు రక్షణ కల్పిస్తాయి. నొప్పి, వాపులను తగ్గిస్తాయి. శరీరంలో చేరిన బ్యాక్టీరియాను నశింపచేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇంత మేలు చేసే పండ్లు మనకు కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని