రంగూ రుచీ ఆరోగ్యాలు పెంచే టొమాటో

కూరగాయలకు అందాల పోటీ పెడితే ఎర్రెర్రని టొమాటోలే గెలుస్తాయంటే అతిశయం కాదు. కూరలకు రంగూ, రుచీ పెంచడంలోనే కాదు.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ వాటికవే సాటి.

Published : 14 Jan 2024 00:02 IST

కూరగాయలకు అందాల పోటీ పెడితే ఎర్రెర్రని టొమాటోలే గెలుస్తాయంటే అతిశయం కాదు. కూరలకు రంగూ, రుచీ పెంచడంలోనే కాదు.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ వాటికవే సాటి. వీటిలో పోషకాలూ ఎక్కువే. ఇంతకీ ఏమేం సుగుణాలున్నాయో చూద్దాం.. టొమాటోల్లో విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, భాస్వరం, ఫొలేట్‌, కార్బోహైడ్రేట్లు, పీచు, ప్రొటీన్లు, గుడ్‌ కొలెస్ట్రాల్‌ ఉన్నాయి. జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. మలబద్ధక సమస్య తలెత్తదు. గుండెజబ్బులు, కురులు, గోళ్ల ఎదుగుదలకు తోడ్పడతాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తాయి. ఊబకాయం రాకుండా తగినంత బరువు ఉండేలా చేస్తాయి. మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఊపిరితిత్తులు, పొట్ట క్యాన్సర్లను నిరోధిస్తాయి. టొమాటోలు పెద్ద పేగు, గొంతు, నోరు, రొమ్ము, గర్భాశయంలో వ్యాధులను నిరోధిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వీటిలోని సి-విటమిన్‌ రోగనిరోధక శక్తిని పెంచితే.. లైకోపీన్‌ చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇది చెడు కొవ్వును తగ్గించడంలో, రక్తపోటును అదుపు చేయడంలో కూడా సాయపడుతుంది. ఇక యాంటీఆక్సిడెంట్లు రోగాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. కూర, చారు, పచ్చడి.. అన్నిట్లో టొమాటోలు వేస్తుంటాం కదా! వీటిని సలాడ్‌, సాస్‌, జామ్‌ రూపంలోనూ తినొచ్చు. జ్యూస్‌ చేసి తాగొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని