కొరియన్‌ మ్యాంగో మిల్క్‌

మండే ఎండలు మనల్ని కొంచెం ఊరడించాలని మామిడి పండ్లను వెంటబెట్టుకొచ్చాయి. మామూలుగా పండ్లరసానికి బదులు ఈసారి కొంచెం కొత్తగా ‘కొరియన్‌ మ్యాంగో మిల్క్‌’ ప్రయత్నించి చూడండి.

Published : 17 Mar 2024 00:07 IST

మండే ఎండలు మనల్ని కొంచెం ఊరడించాలని మామిడి పండ్లను వెంటబెట్టుకొచ్చాయి. మామూలుగా పండ్లరసానికి బదులు ఈసారి కొంచెం కొత్తగా ‘కొరియన్‌ మ్యాంగో మిల్క్‌’ ప్రయత్నించి చూడండి. ఎలా చేయాలంటే.. ఓ గ్లాసులో మామిడి పండు గుజ్జు వేసి.. ఉడికించిన సగ్గుబియ్యం, పాలు, పంచదార, ఐస్‌ క్యూబ్స్‌ వేసి కలపాలి. మరింత టేస్టీగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే కొన్ని బెర్రీస్‌ లేదా కాసిని సబ్జా గింజలు జోడించండి. ఈ పానీయం నోటికి హితవుగా ఉండటమే కాదు, ఆరోగ్యానికీ మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని