Karnataka: ఆకాశంలో అనుమానాస్పద వెలుగుల కలకలం.. వీడియో వైరల్‌

కర్ణాటకలోని తీర ప్రాంతంలో.. ఆకాశంలో అనుమానాస్పద వెలుగులు కనిపించడం కలకలం రేపింది.

Published : 21 Dec 2021 16:03 IST

బెంగళూరు: కర్ణాటకలోని తీర ప్రాంతంలో.. ఆకాశంలో అనుమానాస్పద వెలుగులు కనిపించడం కలకలం రేపింది. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈ వెలుగులు కనిపించాయి. ఓ రైలు బండిలాగా ఒకే వరుసలో ఈ వెలుగులు ముందుకు సాగాయి. అయితే వీటిపై ఖగోళ శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చారు. భూ కక్ష్యలోని ఉపగ్రహాలు తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల అలా వెలుగులా ఏర్పడ్డాయని తెలిపారు. అవి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్  ప్రయోగించిన ఉపగ్రహాలుగా పేర్కొన్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Read latest Viral Videos and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని