సీతాకోకచిలుకాడు

యవ్వనాన్ని సీతాకోకచిలుకలతో పోలుస్తారు చాలామంది. ఉరిమే ఉత్సాహం.. తరిగిపోని అందం ఈ రెండింటి సొంతం. కళ్లకింపైన రూపంతో.. రెక్కలు అల్లార్చుతూ సందడి చేసే సీతాకోకచిలుకలంటే ఇష్టపడని యువత అరుదే.

Published : 11 Mar 2023 00:22 IST

వ్వనాన్ని సీతాకోకచిలుకలతో పోలుస్తారు చాలామంది. ఉరిమే ఉత్సాహం.. తరిగిపోని అందం ఈ రెండింటి సొంతం. కళ్లకింపైన రూపంతో.. రెక్కలు అల్లార్చుతూ సందడి చేసే సీతాకోకచిలుకలంటే ఇష్టపడని యువత అరుదే. మార్చి 14 ప్రపంచ సీతాకోకచిలకల దినోత్సవంగా జరుపుకొంటారు. ఈ సందర్భంగా తిరుపతి యువకుడు, బటర్‌ఫ్లై ప్రేమికుడు ఇనేష్‌ సిద్ధార్థ గురించి చెప్పుకోవాలి. తను శేషాచలం అడవుల్లో ఏళ్లకొద్దీ తిరుగుతూ పదులకొద్దీ అరుదైన జాతుల్ని తన కెమెరాలో బంధించాడు. అందులో లెప్టోటస్‌ ట్రిగెమెటాస్‌, చెస్ట్‌నట్‌ స్ట్రీక్డ్‌ సెయిలర్‌, ఆరెంజ్‌ టిప్డ్‌ పీ బ్లూ, ఎల్లో పాన్సీ, ఇండియన్‌ గ్రిజల్డ్‌ స్కిప్పర్‌, ట్వానీ కోస్టర్‌, లిటిల్‌ టైగర్‌ బ్లూ లాంటివి కొన్ని. ఒక్కో బటర్‌ఫ్లై కోసం రోజంతా ఎదురుచూసి ఫొటో తీసిన సందర్భాలు ఉన్నాయంటున్నాడు సిద్ధార్థ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని