బ్రేస్‌లెట్టు.. నచ్చేట్టు!

యువతకి అందంతోపాటు హుందాతనాన్ని ఇస్తుంది బ్రేస్‌లెట్‌. దీన్ని మరింత స్టైల్‌గా మార్చాలంటే కొన్ని కిటుకులు పాటించాల్సిందే.

Published : 19 Feb 2022 01:22 IST

యువతకి అందంతోపాటు హుందాతనాన్ని ఇస్తుంది బ్రేస్‌లెట్‌. దీన్ని మరింత స్టైల్‌గా మార్చాలంటే కొన్ని కిటుకులు పాటించాల్సిందే.

* సమ్మిళితం: బ్రేస్‌లెట్‌లో ఖరీదైనవి, లోహపువి, సిలికా, స్ట్రింగ్‌.. ఇలా చాలా రకాలుంటాయి. వేర్వేరు రకాలైనవి కలిపి ధరిస్తుంటే.. డిజైన్‌ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి.

* తేలికగా: కొన్నిసార్లు ఒక్క బ్రేస్‌లెట్‌నే చేతికి అందాన్నిస్తుంది. బక్క పల్చని అమ్మాయిలు, అబ్బాయిలు తేలికైనవి వేసుకుంటేనే బాగుంటారు. లెదర్‌, సిల్వర్‌.. తేలికగా, అందంగా ఉంటాయి.

* కలపొద్దు: బ్రేస్‌లెట్‌ అనగానే చాలామంది ప్లాటినం, సిల్వర్‌, బంగారంలాంటి ఖరీదైనవి కోరుకుంటారు. హుందాగా ఉండాలనుకుంటే వీటిలో ఏదైనా ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది. స్టైల్‌గా కనబడాలంటే సిలికా, ఇతర మెటీరియల్‌వి ధరించవచ్చు.

* దుస్తులు: మీ చేతి ఆభరణం స్టైల్‌గా కనబడాలి అనుకుంటే టీషర్టులు, పొట్టి స్లీవ్‌ చొక్కాలు.. అమ్మాయిలైతే స్లీవ్‌లెస్‌ దుస్తులు వేసుకోవడం తప్పనిసరి.

* గ్యాడ్జెట్స్‌: మరీ వదులుగా, మరీ బిగుతుగా ఉంటే సౌకర్యవంతంగా ఉండవు. బ్రేస్‌లెట్‌ వేసుకున్నప్పుడు చేతి చుట్టూ చిటికెన వేలు పట్టేంత వదులుగా ఉంటే అది సరైన సైజు.
సొగసు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని