లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో తెలుగు మెరుపుల్‌

భారతీయ-పాశ్యాత్య ప్లీటెడ్‌ గౌన్లు... పేస్టల్‌ రంగుల్లో మలిచిన పార్టీవేర్‌ డిజైన్లు... జార్జెట్‌ ఫ్యాబ్రిక్‌తో అందంగా తయారు చేసిన ఔట్‌ఫిట్‌లు...

Updated : 26 Feb 2022 06:05 IST

భారతీయ-పాశ్యాత్య ప్లీటెడ్‌ గౌన్లు...

పేస్టల్‌ రంగుల్లో మలిచిన పార్టీవేర్‌ డిజైన్లు...

జార్జెట్‌ ఫ్యాబ్రిక్‌తో అందంగా తయారు చేసిన ఔట్‌ఫిట్‌లు...

వాటిని ధరించి ఒయ్యారాలు ఒలకబోస్తూ షో స్టాపర్‌గా నిలిచిన సూపర్‌ మోడల్‌...

వీటన్నింటి రూపకర్త మన తెలుగమ్మాయి అరుణాగౌడ్‌నే. ‘అల్మారా’ బ్రాండ్‌ సృష్టికర్త తను.

ప్రతిష్ఠాత్మక లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌ ఐదురోజుల వేడుకలో ప్రఖ్యాత డిజైనర్లు, ప్రముఖ ఫొటోగ్రాఫర్లు, ఫ్యాషన్‌ పండితులను తన డిజైన్స్‌తో కట్టిపడేసింది అరుణ. హైడ్‌ పార్క్‌లో నిర్వహించిన ఈ షోకి ఇండియా నుంచి ఎంపికైంది తనొక్కతే. ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు నెలరోజులు ముందుగానే డిజైన్లకు సంబంధించిన స్కెచ్‌లు నిర్వాహకులకు పంపిస్తారు. అనేక వడపోతల అనంతరం ఈ అరుదైన ప్రదర్శనకు ఎంపికైంది మన హైదరాబాదీ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని