కుచ్చిళ్ల హొయలు

చీర కడితే సంప్రదాయ సింగారం.. స్కర్ట్‌ వేస్తే ఆధునికత.. ఈ రెండూ కలగలిపితే ‘డ్రేప్డ్‌ స్కర్ట్‌’. ఫ్యాషన్‌ పండితులు ఈమధ్యే సృష్టించిన ఈ సరికొత్త ఫ్యాషన్‌ అమ్మాయిల మనసుల్ని తాకింది.

Published : 05 Mar 2022 00:11 IST

చీర కడితే సంప్రదాయ సింగారం.. స్కర్ట్‌ వేస్తే ఆధునికత.. ఈ రెండూ కలగలిపితే ‘డ్రేప్డ్‌ స్కర్ట్‌’. ఫ్యాషన్‌ పండితులు ఈమధ్యే సృష్టించిన ఈ సరికొత్త ఫ్యాషన్‌ అమ్మాయిల మనసుల్ని తాకింది. సోనాక్షి సిన్హా, కియారా అద్వానీలాంటి బాలీవుడ్‌ తారలు ఈ  స్టైల్‌కి తమ మేనిపై చోటివ్వగానే ట్రెండ్‌ పరుగందుకుంది. పెళ్లిళ్లు, పండగల్లో వీటిని ధరించడం ఆనవాయితీగా మారింది. క్రాప్‌ టాప్‌లు, లెహెంగాలు, కార్సెట్‌ రవికెలు, ఘరారాలు, జాకెట్స్‌.. వీటితో కలిపి వేసుకున్నా అమ్మాయిల సొగసుల్ని మరింత ఇనుమడింపజేస్తున్నాయి ఈ ఔట్‌ఫిట్‌లు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని