షూపర్‌ సొగసుగా...

కుర్రాళ్లు స్టైల్‌తో చెలరేగిపోవడానికి కాళ్లకు వేసే షూస్‌ పాత్ర తక్కువేం కాదు. సమయం, సందర్భాన్ని బట్టి వీటిని ఎంచుకుంటే సొగసుగా, హుందాగా ఉండొచ్చు. మరి మన షూ అరల్లో ఉండాల్సిన రకాలేంటి అంటే..

Updated : 09 Apr 2022 04:35 IST

కుర్రాళ్లు స్టైల్‌తో చెలరేగిపోవడానికి కాళ్లకు వేసే షూస్‌ పాత్ర తక్కువేం కాదు. సమయం, సందర్భాన్ని బట్టి వీటిని ఎంచుకుంటే సొగసుగా, హుందాగా ఉండొచ్చు. మరి మన షూ అరల్లో ఉండాల్సిన రకాలేంటి అంటే..


ఫార్మల్‌ షూలు: హుందాగా కనిపించాలి అనుకున్నప్పుడు వీటిని ధరించవచ్చు. కార్పొరేట్‌ ఉద్యోగులకు బాగా నప్పుతాయి. సూట్లు, డెనిమ్స్‌, చినోస్‌ దుస్తులకు జతగా బాగుంటాయి. ముఖ్యంగా నలుపు రంగు కోటు వేసినప్పుడు వీటిని ఎంచుకోవాలి.


బూట్లు: సొగసుల్ని పరుగులు పెట్టించాలి అనుకునే కుర్రాళ్లు బూట్లతో చెలరేగిపోవచ్చు. చీలమండ దాకా ఉన్నవైతే మరింత స్టైల్‌గా ఉంటాయి. ఇందులో లేస్‌ల బూట్లు హుందాగా ఉంటాయి. భారీకాయులకైతే రైడింగ్‌, ఆర్మీ, కౌబాయ్‌, మోటార్‌సైకిల్‌ రకాల బూట్లు నప్పుతాయి. జీన్స్‌, టీషర్టులకు జతగా బాగుంటాయి.


లెదర్‌ క్యాజువల్స్‌: సౌకర్యం, సొగసూ.. కావాలనుకుంటే వీటికి ఓటేయొచ్చు. ఇవి ధరించినప్పుడు సాక్సులు వేసినా, వేయకపోయినా ఫర్వాలేదు. జీన్స్‌, షార్ట్స్‌, ట్రౌజర్స్‌.. వేటికైనా నప్పుతాయి. లేసులు ఉన్నవి కావాలా? లేనివి ఎంచుకోవాలా.. అన్నది మీ ఇష్టం. కాలేజీ, ఆఫీసు, పార్టీ.. సందర్భం ఏదైనా సరిపోతాయి.


స్పోర్ట్స్‌ షూలు: పొద్దునే వ్యాయామం చేసే కుర్రాళ్లు, జిమ్‌లో కసరత్తులు చేసే అబ్బాయిల ర్యాక్స్‌లో ఇవి తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. తేలికగా, స్టైల్‌గా ఉండటం వీటి ప్రత్యేకత. జాగింగ్‌, వాకింగ్‌, జిమ్‌, క్రీడలకు ఇవి ప్రత్యేకం.


స్నీకర్లు: కొంచెం స్టైల్‌, కొంచెం హుందాతనం కావాలనుకునే అబ్బాయిలు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. కార్యాలయాలు, కళాశాలలు, వేడుకలు.. ఏ సందర్భం అయినా ఫర్వాలేదు. స్నీకర్లకు జతగా డెనిమ్స్‌, చినోస్‌ బాటమ్‌వేర్‌గా వేస్తే ఆకట్టుకునేలా ఉంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని