ఫ్యానీ ప్యాక్‌.. కుర్రకారు సోకు

స్టైల్‌గా కనిపించాలనుకునే అమ్మాయిలు తనువులో అణువణువూ సొగసు కేంద్రాలుగా మలచుకుంటారు. షోకిల్లారాయుళ్లు ఒంటినే షోకేసుల కాన్వాసులుగా మార్చేస్తారు. అలంకరణ, దుస్తులు, యాక్సెసరీలు.. ప్రతీదీ తమకు అనుకూలంగా

Published : 23 Apr 2022 01:43 IST

స్టైల్‌గా కనిపించాలనుకునే అమ్మాయిలు తనువులో అణువణువూ సొగసు కేంద్రాలుగా మలచుకుంటారు. షోకిల్లారాయుళ్లు ఒంటినే షోకేసుల కాన్వాసులుగా మార్చేస్తారు. అలంకరణ, దుస్తులు, యాక్సెసరీలు.. ప్రతీదీ తమకు అనుకూలంగా మలచుకుంటారు. ఇప్పుడు బెల్ట్‌ బ్యాగుల వంతు వచ్చింది. వీటినే స్టైల్‌గా ‘ఫ్యానీ ప్యాక్‌’ అని పిలుస్తున్నారు. బెల్టులాంటి పట్టీకి చిన్న పౌచ్‌ అనుసంధానమై ఉండటమే దీని తీరు. నడుముకు చుట్టుకోవడం లేదా పౌచ్‌ ఛాతీ, పొట్టపైకి వచ్చేలా వేలాడదీసుకోవడం.. ఎలాగైనా పోజు కొట్టొచ్చు. ఇందులో ఫోన్‌, నగదు, విలువైన వస్తువులు దాచుకోవచ్చు. ఈమధ్య కాలంలో సమంతా, పూజాహెగ్డే, విజయ్‌ దేవరకొండల నుంచి ప్రతి సెలెబ్రిటీ ఈ ఫ్యానీ బ్యాగ్‌కి ఫిదా అయిపోయారు. తారలు మొదలుపెట్టిన ట్రెండ్‌ని అభిమానులు, కళాశాల విద్యార్థులు.. ఆదరించకుండా ఉండరు కదా. మేం సొగసు రాయబారులం, ఆధునికులం.. అని భావించే యువత పొలోమని వీటి బాట పడుతున్నారు. ఇందులో లెదర్‌, సింథటిక్‌, ఫాక్స్‌..లాంటి రకాలెన్నో ఉన్నాయి. మరింత స్టైల్‌గా కనిపించాలనుకునేవాళ్లు అయితే ఓ అడుగు ముందుకువేసి డ్రెస్‌ రంగుకి తగ్గట్టుగా ఫ్యానీ ప్యాక్‌ ఎంచుకుంటున్నారు. సంప్రదాయ, ఫార్మల్‌ దుస్తులపై కాకుండా.. జాకెట్స్‌, జీన్స్‌, టీస్‌, లెగ్గింగ్స్‌, స్కర్ట్స్‌..లాంటి వాటిపై ఈ ఫ్యానీ ప్యాక్‌లు ధరిస్తే బాగుంటుందని సొగసు పండితుల సలహా. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని