రంగు పడితే.. మీరే స్టైల్‌ కింగ్‌!

కొత్త దుస్తులు.. కొత్త ఫ్యాషన్లతో అన్నిసార్లూ మాయ చేయడం కుదరకపోవచ్చు.. అప్పుడేం చేయాలి? ఉన్నవాటితోనే సరికొత్తగా, స్టైల్‌గా కనిపించేలా ప్రయత్నించాలి. ఉన్న ఔట్‌ఫిట్స్‌లలోనే సరైన కలర్‌ కాంబినేషన్‌వి ఎంచుకోవాలి. అప్పుడు మనం మెరిసిపోవడం ఖాయం.  

Updated : 30 Apr 2022 04:52 IST

కొత్త దుస్తులు.. కొత్త ఫ్యాషన్లతో అన్నిసార్లూ మాయ చేయడం కుదరకపోవచ్చు.. అప్పుడేం చేయాలి? ఉన్నవాటితోనే సరికొత్తగా, స్టైల్‌గా కనిపించేలా ప్రయత్నించాలి. ఉన్న ఔట్‌ఫిట్స్‌లలోనే సరైన కలర్‌ కాంబినేషన్‌వి ఎంచుకోవాలి. అప్పుడు మనం మెరిసిపోవడం ఖాయం.

* ముదురు ఆకుపచ్చ చొక్కా లేదా టీషర్టుకి జతగా నలుపురంగు జీన్స్‌ వేయాలి. వీటితోపాటు తెలుపు రంగు స్నీకర్లు వేస్తే బాగా ఎలివేట్‌ అవుతారు.

* లేత బూడిద రంగు ప్యాంట్‌పై ముదురు బూడిద రంగు చొక్కా ధరించాలి. ఈ రెండింటికి అదనంగా నలుపు రంగు బూట్లు వేస్తే ఆకట్టుకుంటాయి.

* లేత నీలం రంగు లేదా లేత ఆకుపచ్చ చొక్కాకి జోడీగా తెలుపు రంగు జాగర్స్‌ లేదా జీన్స్‌ నప్పుతాయి. వీటితోపాటు నీలిరంగు బ్లూ స్నీకర్లు.. కళ్లకింపుగా ఉంటాయి. ఈ కాంబినేషన్‌ కాలేజీ విద్యార్థులకు బాగా నప్పుతాయి.

* ఆలివ్‌ గ్రీన్‌ ట్రౌజర్‌పై తెలుపు రంగు చొక్కా వేయడం... కుర్రాళ్లకు ప్రత్యేకం. పాదరక్షలు సైతం తెలుపు రంగులో ఉంటే మెరుపులు మీవే.

* మెరూన్‌ రంగు చొక్కా, బీగ్‌ ప్యాంటు, బ్రౌన్‌ రంగు షూలు.. ఉద్యోగులు, కాలేజీ కాలేజీ విద్యార్థులు ఎవరికైనా బాగుంటాయి.

* లేత రంగు నేవీ బ్లూ, దీనికి జతగా బీగ్‌ కలర్‌ ట్రౌజర్‌... నలుపు లేదా బ్రౌన్‌ రంగు బూట్లు వేసి, టక్‌ చేస్తే హుందాగా కనిపిస్తారు.

- షణ్మిత గాయత్రి, ఫ్యాషన్‌ డిజైనర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని