రోడ్డేదేనా దూసుకెళ్లాల్సిందే!

యువతను మెప్పించడానికి సుజుకి వీ-స్ట్రామ్‌ 250 ఎస్‌ఎక్స్‌ ద్విచక్రవాహనం విపణిలోకి దూసుకొస్తోంది. ఆ సంగతులు.

Updated : 07 May 2022 05:28 IST

యువతను మెప్పించడానికి సుజుకి వీ-స్ట్రామ్‌ 250 ఎస్‌ఎక్స్‌ ద్విచక్రవాహనం విపణిలోకి దూసుకొస్తోంది. ఆ సంగతులు.
* వీ-స్ట్రామ్‌ ఎస్‌ఎక్స్‌.. ఇదివరకు ఉన్న మోడల్‌కి కొత్త హంగులు అద్దుకొని వస్తున్న బండి.
* పెద్ద చక్రాలు, అత్యధిక గ్రౌండ్‌ క్లియరెన్స్‌, భారీ ఇంధన ట్యాంకు, ఎతైన హ్యాండిల్‌బార్‌, వెడల్పాటి సీట్లు.. అడ్వెంచర్‌ బైక్‌కి ఉండే ఫీచర్లన్నీ ఇందులో ఉన్నాయి. గతుకులు, లోయలు, కొండలు..లాంటి రోడ్డు ఏదైనా దూసుకెళ్తుంది.
* ఏబీఎస్‌, నకుల్‌ గార్డ్‌లు, యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌, నావిగేషన్‌, సాంకేతికాంశాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లాంటి ఫీచర్లున్నాయి.
* 249సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌, 26.1హెచ్‌పీ ఇంజిన్‌.. సాంకేతికాంశాలు.  
* అత్యధిక వేగం 150కి.మీ.లు/గం. కేటీఎం 250 ఏడీవీతో పోటీపడబోతోంది. ధర రూ: 2.11లక్షలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని