ధనశ్రీ సొగసుల సిక్సర్లు!

ఈ ఐపీఎల్‌లో బౌండరీలు, వికెట్లతోపాటు హోరెత్తుతున్న మరో పేరు ధనశ్రీవర్మ. రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు యజువేంద్ర చాహల్‌ అర్ధాంగి. ఆ జట్టుకి మద్దతుగా తను ఏకంగా ఫ్యాషన్‌ పెరేడ్‌నే నిర్వహిస్తోంది. వీఐపీ గ్యాలరీలో ఉన్నా..

Updated : 07 May 2022 05:33 IST

ఈ ఐపీఎల్‌లో బౌండరీలు, వికెట్లతోపాటు హోరెత్తుతున్న మరో పేరు ధనశ్రీవర్మ. రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు యజువేంద్ర చాహల్‌ అర్ధాంగి. ఆ జట్టుకి మద్దతుగా తను ఏకంగా ఫ్యాషన్‌ పెరేడ్‌నే నిర్వహిస్తోంది. వీఐపీ గ్యాలరీలో ఉన్నా.. ప్రేక్షకుల చెంతనున్నా కెమెరాల కళ్లన్నీ ఆమెపైనే వాలిపోతున్నాయి. ఐపీఎల్‌ ఆరంభం నుంచి రాజస్థాన్‌ జట్టు వేసుకునే గులాబీ రంగు డిజైనర్‌ దుస్తులతోనే చెలరేగిపోతోంది ఈ అమ్మడు. కోల్‌కతాతో మ్యాచ్‌కి ముందు ‘మోషినో’ బ్రాండ్‌ గులాబీ రంగు పొట్టి స్కర్టులో తళుక్కుమంది. ముంబయి మ్యాచ్‌ అప్పుడు పూల డిజైన్ల చుడీదార్‌తో మెరిసింది. అంతకుముందు జిమ్‌ డ్రెస్‌పై నేవీ బ్లూ రంగు జాకెట్‌ వేసి.. పింక్‌ రంగు ఫోన్‌తో మిర్రర్‌ సెల్ఫీతో మద్దతు తెలిపింది. ‘క్రీజులో కుదురుకుంటే బ్యాట్స్‌మన్‌ చెలరేగిపోతాడు. మనం ఒక్కసారి కారులో హాయిలో కూర్చుంటే మనసుకి  సౌకర్యం, శాంతి’ అంటూ మోడ్రన్‌ దుస్తులు ధరించి కారులో కూర్చున్న ఫొటోని ఇన్‌స్టాలో పెట్టింది. అటు చాహల్‌ మైదానంలో ఆటతో మెప్పిస్తుంటే.. ఇటు ధనశ్రీ తన సొగసులతో కట్టిపడేస్తోంది. అన్నట్టు తను మంచి డాన్సర్‌ కూడా. ఇన్‌స్టాలో యాభై లక్షలమంది ఫాలోయర్లు ఉన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని