అనగనగా ఓ ట్రెండ్‌

సెల్‌ఫోనే కాదు.. దానికి వేసే స్క్రీన్‌గార్ఢూ. తొడిగే బ్యాక్‌ కవరూ స్టైల్‌గా, అందర్నీ ఆకర్షించేలా ఉండాలన్నది యువత పంతం. ఆ అభిరుచిని అందుకొని, సొమ్ము చేసుకునేలా విపణిలోకి కొత్తకొత్త గ్యాడ్జెట్లు వస్తూనే ఉంటాయి. ‘ది ఆర్మౌర్‌ క్యాండీ కార్నర్‌ ప్రొటెక్టర్‌

Published : 09 Jul 2022 01:32 IST

సెల్‌ఫోనే కాదు.. దానికి వేసే స్క్రీన్‌గార్ఢూ. తొడిగే బ్యాక్‌ కవరూ స్టైల్‌గా, అందర్నీ ఆకర్షించేలా ఉండాలన్నది యువత పంతం. ఆ అభిరుచిని అందుకొని, సొమ్ము చేసుకునేలా విపణిలోకి కొత్తకొత్త గ్యాడ్జెట్లు వస్తూనే ఉంటాయి. ‘ది ఆర్మౌర్‌ క్యాండీ కార్నర్‌ ప్రొటెక్టర్‌’ అలాంటిదే. స్మార్ట్‌ఫోన్‌ నాలుగు మూలల్లో వీటిని బిగించాలి. ఒకవేళ ఫోన్‌ కింద పడితే, పగిలిపోకుండా ఇవి కాపాడతాయి. టేబుల్‌లాంటి ఉపరితలంపై పెట్టినప్పుడు దుమ్మూధూళి అంటకుండా చూస్తాయి. అంతకుమించి వీటి ప్రత్యేకత ఏంటంటే.. చూడ్డానికి జ్యువెల్లరీలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. బిగించడం, విప్పదీయడం తేలిక. ఏడు రంగుల్లో దొరుకుతున్నాయి. వీటిని మొబైల్‌కి బిగిస్తే.. సొగసైన అమ్మాయిని నగలతో అందంగా ముస్తాబు చేసినట్టే కనువిందు చేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు