స్కర్టు వేసి సైసై

స్కర్టు వేసి పోజు కొట్టడం అమ్మాయిల హక్కు! నిండైనవి.. కురచవి.. ఏదైౖనా వాళ్లిష్టం. ఇదే ఔట్‌ఫిట్‌ని అబ్బాయిలు వేస్తే ఆగకుండా నవ్వేస్తాం కదూ! అయితే మాకేంటట? ఇది మాకు నచ్చిన స్టైల్‌ అంటున్నారు. వాళ్లు మామూలోళ్లేం కాదు.. కుర్రాళ్లు ఆరాధించే హీరోలు.

Updated : 13 Aug 2022 12:14 IST

స్కర్టు వేసి పోజు కొట్టడం అమ్మాయిల హక్కు! నిండైనవి.. కురచవి.. ఏదైౖనా వాళ్లిష్టం. ఇదే ఔట్‌ఫిట్‌ని అబ్బాయిలు వేస్తే ఆగకుండా నవ్వేస్తాం కదూ! అయితే మాకేంటట? ఇది మాకు నచ్చిన స్టైల్‌ అంటున్నారు. వాళ్లు మామూలోళ్లేం కాదు.. కుర్రాళ్లు ఆరాధించే హీరోలు. తాజాగా హాలీవుడ్‌ స్టార్‌ బ్రాడ్‌పిట్‌ స్కర్ట్‌ బాట పట్టడంతో ఈ సంగతి సంచలనమై కూర్చుంది. బ్రాడ్‌పిట్‌ తన ‘బుల్లెట్‌ ట్రైన్‌’ సినిమా ప్రీమియర్‌లో భాగంగా పిక్కలు కనిపించేలా బ్రౌన్‌ రంగు స్కర్టు వేసుకొని వచ్చాడు. పక్కనే ఉన్న కెమెరాలు క్లిక్‌మనకుండా ఉండవుగా! ఆ ఫొటోలే వైరల్‌ అయ్యాయి. ఇలాంటి అవతారాలెత్తడం కథానాయకులకు కొత్తేం కాదండోయ్‌..


రణ్‌వీర్‌ సింగ్‌

ఏడేళ్ల కిందట బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌.. ‘బాజీరావు మస్తానీ’ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఇలాగే స్కర్టుధారణతో చెలరేగిపోయాడు. లెహెంగా స్టైల్‌ స్కర్టు వేసి తను చేసిన సందడి తక్కువేం కాదు. ఇది ‘జెండర్‌ న్యూట్రల్‌ డ్రెస్సింగ్‌’ అంటూ అభిమానులు కవర్‌ చేశారు.


జాడెన్‌ స్మిత్‌

కుర్ర హీరో జాడెస్‌ స్మిత్‌ సైతం ఈ స్టైల్‌ని అప్పట్లోనే ఫాలో అయ్యాడు. టై అండ్‌ డై డిజైన్ల స్కర్టుతో అదరగొట్టాడు. హాలీవుడ్‌ స్టార్‌ విన్‌ డీజిల్‌ ఓ చిత్రోత్సవంలో, పాప్‌సింగర్‌ కేన్‌ వెస్ట్‌ సంగీత కచేరీలో ఈ స్టైల్‌తో కనిపించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని