టీషర్టు.. ఇలా హిట్టు

ఈరోజుల్లో టీషర్టు వేయని యువత అరుదే. కుర్రతనానికి చిరునామాలా ఉండే ఈ ఔట్‌ఫిట్‌లో మూడు రకాలు ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో ఉండాలంటారు.

Published : 17 Sep 2022 00:40 IST

ఈరోజుల్లో టీషర్టు వేయని యువత అరుదే. కుర్రతనానికి చిరునామాలా ఉండే ఈ ఔట్‌ఫిట్‌లో మూడు రకాలు ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో ఉండాలంటారు.

క్లాసిక్‌: దీన్నే బేసిక్‌ టీషర్టు అంటారు. శరీరాకృతి బాగున్న ప్రతి కుర్రాడికి ఇది నప్పుతుంది. కాలేజీ విద్యార్థులు, యువోద్యోగులు.. రౌండ్‌ నెక్‌ టీషర్టులు వేస్తే బాగుంటారు. నడి వయస్కులైతే కుర్రతనం కనిపించేలా చేస్తాయి. ఇందులో స్కిన్‌ టైట్‌, వదులువి, ఓవర్‌సైజ్ట్‌ అని మూడు రకాలుంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు రోజువారీ వాడకానికి బాగుంటాయి.
హెన్లీ: ఇది నెక్‌ టీషర్టులా కాకుండా వదులు, బిగుతు చేసుకోవడానికి రెండు, మూడు గుండీలు ఉంటాయి. కాలర్‌ ఉండదు. వీ ఆకారంలో ఉండటంతో చూడటానికి స్టైలిష్‌ కనిపిస్తుంటాయి. పార్టీలు, క్రీడా సందర్భాలకు చక్కగా సరిపోతాయి. జీన్స్‌కి జతగా ఈ స్లీవ్డ్‌ టీషర్టులు ధరిస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాం.
పోలో: ఫార్మల్‌గా కనిపించాలనుకునే వాళ్లకి ఇది సరైన ఎంపిక. మరీ వదులుగా, బిగుతుగా ఉండకుండా పరిమాణం సరిగ్గా సరిపోయినప్పుడే ఈ టీషర్టులో హుందాగా కనిపిస్తారు. కాలర్‌ని పైకి అంటే స్పోర్టీగా కనిపించొచ్చు. ట్రౌజర్‌, జీన్స్‌కి జతగా వేసి, టక్‌ చేస్తే మరింత స్టైలిష్‌గా ఉంటారు.
* మన అభిరుచికి అనుగుణంగా ఇందులో ప్రింటెడ్‌, ప్లెయిన్డ్‌, స్ట్రైప్డ్‌.. ఏవైనా ఎంచుకోవచ్చు.

- షణ్మిత గాయత్రి, ఫ్యాషన్‌ డిజైనర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని