దీపావళి.. సొగసుల కేళీ!

కాంతలు, కుర్రాళ్లూ కళకళలాడితేనే కాంతుల పండగకి అసలైన మజా. కానీ ఆధునికమైన స్టైల్‌తో చెలరేగే యువత ఈ సందర్భంలో సంప్రదాయానికి పెద్దపీట వేయాల్సిందే. సొగసులు ఇనుమడించేలా ఇదిగో ఇలా ముస్తాబు కావాలంటున్నారు ఫ్యాషన్‌ పండితులు.

Published : 08 Oct 2022 00:28 IST

కాంతలు, కుర్రాళ్లూ కళకళలాడితేనే కాంతుల పండగకి అసలైన మజా. కానీ ఆధునికమైన స్టైల్‌తో చెలరేగే యువత ఈ సందర్భంలో సంప్రదాయానికి పెద్దపీట వేయాల్సిందే. సొగసులు ఇనుమడించేలా ఇదిగో ఇలా ముస్తాబు కావాలంటున్నారు ఫ్యాషన్‌ పండితులు.

* అబ్బాయిలు.. సింపుల్‌గా కుర్తాలు, షేర్వాణీలను ఎంచుకోవచ్చు. అమ్మాయిలకైతే మెరిసిపోవడానికి బోలెడన్నీ దారులు. చీరలో సింగారించుకోవడం నుంచి మొదలుపెడితే చెవిరింగులు, కాలి పట్టీలు.. వడ్డాణాలు.. తనువులో అణువణువూ పండగకి చోటివ్వొచ్చు.
* లెగ్గింగ్స్‌, జెగ్గింగ్స్‌ వదలలేం అనుకునేవాళ్లు పలాజ్జో, షరారాలకు ఓటేయొచ్చు. కుర్తాలూ ఎప్పటికైనా ఫేవరిటే. వీటిలోనూ కాంట్రాస్టు రంగులు, కళ్లకింపుగా కనబడే ముదురు వర్ణాలు ఎంచుకుంటే పండగ కళ ఉట్టిపడుతుంది.
* స్కర్టులంటే అభిమానం ఉన్న అమ్మాయిలు ఈమధ్య కాలంలో బాగా పాపులరైన ప్రింట్లతో కూడిన లాంగ్‌స్కర్టులు ఎంచుకోవచ్చు.
దీనిపై మెరుపుల టాప్‌ వేస్తే అందరి కళ్లూ పడటం ఖాయం. వీటికి జుంకాలు, చాంద్‌బలీలు జోడించాలి సుమా.

మతాబులు, కాకరపువ్వొత్తుల మెరుపులు వీధుల్లోనే కాదు.. మీ ఒంటిపైనా ఉండాలంటే పేస్టల్స్‌తో కూడిన డిజైన్లు, చేతికి మెరుపుల గాజులు, మధ్యరకం హీల్స్‌, మెడలో ముత్యాల హారాలు.. ఎంచుకుంటే మరింత రిచ్‌ లుక్‌ వస్తుంది.
కుర్తాపైజమా, షేర్వాణీ, పఠానీ సూట్లు, ధోతీ కుర్తా, నెహ్రూ జాకెట్‌.. సంప్రదాయం ఉట్టిపడాలి అనుకునే అబ్బాయిలకు కొన్ని ఆప్షన్లు. ఫ్లోరల్‌ ప్రింట్లు, జామెట్రిక్‌ డిజైన్లు.. కుర్రాళ్లకు ఈ సందర్భంలో మరిన్ని మెరుగులద్దుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని