రేసులో.. రేసింగ్‌ జాకెట్‌

రేస్‌లో పాల్గొన్నప్పుడే కాదు.. స్టైల్‌ని పరుగు పెట్టించాలన్నా రేసింగ్‌ జాకెట్‌తో చెలరేగిపోవచ్చు అంటున్నారు యూత్‌. టాలీవుడ్‌, బాలీవుడ్‌ తారల నుంచి గల్లీ పోరగాళ్ల దాకా.. ఈ ట్రెండ్‌ని ఆదరిస్తున్నారు.

Updated : 19 Nov 2022 00:28 IST

రేస్‌లో పాల్గొన్నప్పుడే కాదు.. స్టైల్‌ని పరుగు పెట్టించాలన్నా రేసింగ్‌ జాకెట్‌తో చెలరేగిపోవచ్చు అంటున్నారు యూత్‌. టాలీవుడ్‌, బాలీవుడ్‌ తారల నుంచి గల్లీ పోరగాళ్ల దాకా.. ఈ ట్రెండ్‌ని ఆదరిస్తున్నారు. ‘ఏంటట వీటి ప్రత్యేకత?’ అంటే.. ముందు అందరూ చెప్పే మాట రేసింగ్‌ జాకెట్‌లు సొగసుతోపాటు సౌకర్యంగా ఉంటాయి అని. వీటిని ఒంటిపైకి చోటివ్వడానికి ఆడామగా అనే తేడాలేం లేవు.
స్టైలిష్‌గా ఉండటమే కాదు.. ఒంటికి వెచ్చదనం ఇవ్వడంతో ఈ చలికాలంలో ట్రెండ్‌ జోరందుకుంటోంది. తారల విషయానికొస్తే.. మన పూజాహెగ్డే, సమంత, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్యలతోపాటు.. అలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌, వాణీకపూర్‌లు సైతం ఈ రేసింగ్‌ జాకెట్‌లతో ఆఫ్‌ స్క్రీన్‌లో తళుక్కుమన్నారు. ఆ అభిమాన తారల్ని ఫాలో అయ్యే అమ్మాయిలు, అబ్బాయిలూ వాళ్ల
స్టైల్‌నీ అనుకరించకుండా ఉంటారా? రేసింగ్‌ జాకెట్‌ని టీషర్టు, జీన్స్‌, ట్రౌజర్‌... వేటికైనా జతగా వేసుకోవచ్చు. వీటితోపాటు సరిపోయే బూట్లు వేస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుందన్నది ఫ్యాషనిస్టుల మాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని