షకీరానే టాప్‌

రేపే ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ పండగ ప్రారంభం. ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్‌లు, అభిమానుల కోలాహలంతోపాటు.. ఈ సంరంభంలో తప్పకుండా గుర్తొచ్చేది థీమ్‌ సాంగ్‌లు కూడా.

Updated : 19 Nov 2022 00:31 IST

రేపే ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ పండగ ప్రారంభం. ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్‌లు, అభిమానుల కోలాహలంతోపాటు.. ఈ సంరంభంలో తప్పకుండా గుర్తొచ్చేది థీమ్‌ సాంగ్‌లు కూడా. ఫిఫా 1990 నుంచి ప్రతి వరల్డ్‌కప్‌ సందర్భంగా ఓ అధికారిక థీమ్‌సాంగ్‌ విడుదల చేస్తోంది. మొత్తమ్మీద పది సాంగ్స్‌ వచ్చాయి ఇప్పటి వరకు. పాప్‌సింగర్లు రికీ మార్టిన్‌, బ్రిట్నీ స్పియర్‌, అనస్టేసియా, షకీరా, టోనీ బ్రాక్స్‌టన్‌, పిట్‌బుల్‌, ఎరా ఎస్ట్రేఫీలు పాడారు. ఇందులో 2010లో షకీరా పాడిన ‘వాక్కా వాక్కా దిస్‌ టైమ్‌ ఫర్‌ ఆఫ్రికా..’నే ఇప్పటికీ టాప్‌ గీతంగా ఎంపికైంది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారీ ఈ సాంగ్‌ వినపడుతూనే ఉంది. ఈ దఫా ‘హయ్యా హయ్యా’, ‘లైట్‌ ద స్కై అప్‌’ అధికారిక గీతాలుగా ఎంపిక చేశారు. రెండో గీతంలో మన భారతీయ డ్యాన్సర్‌ నోరా ఫతేహి కనిపించనుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని