చలిలోనూ సాఫీగా..

బండి లేకుండా కుర్రాళ్లకి రోజు ముందుకెళ్లదు. ఆ బండికేమో ఈ చలికాలం అంటే వణుకు. తరచూ మొరాయిస్తుంది.

Published : 03 Dec 2022 00:10 IST

బండి లేకుండా కుర్రాళ్లకి రోజు ముందుకెళ్లదు. ఆ బండికేమో ఈ చలికాలం అంటే వణుకు. తరచూ మొరాయిస్తుంది. మరి ప్రయాణం సాఫీగా సాగాలంటే ఏం చేయాలి?

* శీతకాలంలో మనకి స్వెటర్లు, జాకెట్లు ఎంత అవసరమో.. ద్విచక్రవాహనాలకూ కవర్లు అంతే. ముఖ్యంగా వాహనాలు బయట పెట్టినప్పుడు కవర్లతో కప్పి ఉంచాలి. లేదంటే స్టార్టింగ్‌ సమస్యలొస్తాయి. ఇంజిన్‌, ఇతర విభాగాలు.. బిగుసుకుపోతాయి.
* చలికాలంలో టైర్లలో గాలి తగ్గిపోతుంటుంది. పొగమంచు కురుస్తున్న సమయంలో టైర్లు రోడ్డుపై జారిపోతుంటాయి. దూర ప్రయాణాల్లో టైర్‌ ప్రెషర్‌ని తప్పకుండా పరీక్షిస్తుండాలి.
* ఈ సమయంలో రేడియేటర్‌ బిగుసుకుపోయే సమస్య వస్తుంటుంది. విరుగుడుగా యాంటీ ఫ్రీజ్‌లు ఉపయోగించాలి. కూలెంట్‌లు, యాంటీ ఫ్రీజ్‌లు కలిపిన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
* చలికాలంలో బ్యాటరీ సమస్యలు ఎక్కువ. ముఖ్యంగా పాతరకం బ్యాటరీల్లో తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా ఫ్లూయిడ్లు చిక్కబడతాయి. పెట్రోల్‌, ఆయిళ్ల సరఫరాలో అవాంతరాలు ఏర్పడతాయి. బ్యాటరీ టెర్మినళ్లు తరచూ శుభ్రం చేస్తుండాలి.
ఇంజిన్‌ ఆయిల్‌ని ఎక్కువ కాలం వాడుతుంటే.. అది ఇంజిన్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఏ కాలంలో అయినా గడువు ముగిసిన ఇంజిన్‌ ఆయిల్‌ను వెంటనే మార్చుతుండాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని