మండల కళతో మెప్పిస్తూ..

బొమ్మలేసే వాళ్లంతా పికాసోలు అయిపోరు! ఊహలకు రూపమిచ్చిన వాళ్లు ఎం.ఎఫ్‌.హుస్సేన్‌లూ కాలేరు. అయినా ఎవరి శైలి వారిదే. ఎవరి ప్రత్యేకత వారిదే.

Published : 03 Dec 2022 00:11 IST

బొమ్మలేసే వాళ్లంతా పికాసోలు అయిపోరు! ఊహలకు రూపమిచ్చిన వాళ్లు ఎం.ఎఫ్‌.హుస్సేన్‌లూ కాలేరు. అయినా ఎవరి శైలి వారిదే. ఎవరి ప్రత్యేకత వారిదే. చేస్తున్న పనిలో కొత్తదనం ఉంటే పేరు వెంట పడి మరీ వచ్చేస్తుంది. హైదరాబాదీ నవ్య అగర్వాల్‌ అలా భిన్నమైన బాటలోనే వెళ్తోంది. పద్దెనిమిదేళ్లకే కుంచెతో ప్రయోగాలు చేస్తూ.. పలువురి మెప్పు పొందుతోంది. తను నలుగురు నడిచే దారిలో కాకుండా ఆధ్యాత్మిక బాట పట్టింది. అన్ని మతాల పవిత్ర సంజ్ఞలు, ఆచారాలు, సంప్రదాయాలకు అద్దం పట్టేలా చిత్రాల్ని మలుస్తోంది. ముఖ్యంగా హిందూ, బౌద్ధ మతాలు పవిత్రంగా భావించే.. ‘మండల’కు చిత్ర రూపం ఇస్తోంది. ‘పూర్వీకులు మనకు అమూల్యమైన ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు అందించారు. వీటిని ఆచరించవలసిన, కాపాడవలసిన బాధ్యత మనందరిది. ఇందులో పవిత్రమైన ‘మండల’ని చిత్రకళ ద్వారా యువతకు అందించాలన్నదే నా తాపత్రయం. అందుకే ఇటువైపు వచ్చా’ అంటోంది నవ్య. తను గీసిన చిత్రాలతో పలు ప్రదర్శనలు  ఇచ్చింది. ఆమె ప్రయత్నానికి, కళకు మంచి ప్రశంసలొచ్చాయి. తల్లి, తాతయ్యల స్ఫూర్తితో ఈ కళను అందిపుచ్చుకున్నానంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని