మరింత గ్లామర్‌గా..

కుర్రకారు బాగా ఇష్టపడే ద్విచక్రవాహనాల్లో ముందుండే పేరు హీరో మోటోకార్ప్‌ ‘గ్లామర్‌’. రూ.లక్షలోపు ధరతో, యువత మెచ్చే చాలా ఫీచర్లుంటాయి దీనిలో.

Published : 02 Sep 2023 00:22 IST

కుర్రకారు బాగా ఇష్టపడే ద్విచక్రవాహనాల్లో ముందుండే పేరు హీరో మోటోకార్ప్‌ ‘గ్లామర్‌’. రూ.లక్షలోపు ధరతో, యువత మెచ్చే చాలా ఫీచర్లుంటాయి దీనిలో. ఈ టూ వీలర్‌ మరిన్ని మెరుగులద్దుకొని గ్లామర్‌-2023గా వస్తోంది. ఇందులో మార్పులు, చేర్పులు ఏమున్నాయంటే..

  •  మస్క్యులర్‌ ఫ్యూయెల్‌ ట్యాంకు, గ్రాబ్‌రెయిల్‌తో కూడిన సింగిల్‌ పీస్‌ సీటు, కొత్త రూపంలో అలాయ్‌ చక్రాలు.. డిజైన్‌లో వచ్చిన ప్రధాన మార్పులు.
  •  క్యాండీ బ్లేజింగ్‌ రెడ్‌, స్పోర్ట్స్‌ రెడ్‌ బ్లాక్‌, టెక్నో బ్లూ బ్లాక్‌.. కొత్తగా తీసుకొస్తున్న రంగులు.
  •  ఎప్పట్లాగే 125సీసీ, 10.8పీఎస్‌,10.6ఎన్‌ఎం టార్క్‌.. పాత ఇంజిన్‌, సాంకేతిక ఫీచర్లతోనే వస్తోంది. లీటరుకి 63కి.మీ.ల మైలేజీనిస్తుంది.
  •  సీటు ఎత్తుని రైడర్‌ స్థానంలో 8ఎంఎం, వెనక ప్రయాణికుడి స్థానాన్ని 17ఎంఎం తగ్గించారు. ఫుల్‌ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, యూఎస్‌బీ ఛార్జింగ్‌, లో ఫ్యూయల్‌ ఇండికేటర్‌.. కొన్ని చెప్పుకోదగ్గ ఫీచర్లు.
  •  ధర రూ.86,348 (ఎక్స్‌ షోరూం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని