సొగసుల బెల్‌బాటమ్‌..

ఫ్యాషన్‌ ట్రెండ్‌లకు ఆరంభమే తప్ప అంతం ఉండదంటారు ఫ్యాషనిస్ట్‌లు. ఒకప్పుడు జనాన్ని ఊపేసిన స్టైల్‌లు కొద్దిపాటి మార్పులతో మళ్లీ మళ్లీ తిరిగొస్తుంటాయి.

Published : 09 Sep 2023 00:53 IST

ఫ్యాషన్‌ ట్రెండ్‌లకు ఆరంభమే తప్ప అంతం ఉండదంటారు ఫ్యాషనిస్ట్‌లు. ఒకప్పుడు జనాన్ని ఊపేసిన స్టైల్‌లు కొద్దిపాటి మార్పులతో మళ్లీ మళ్లీ తిరిగొస్తుంటాయి. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల కాలంలో కుర్రకారుని మెప్పించిన బెల్‌బాటమ్‌ ప్యాంట్‌లు తొంభయ్యో దశకంలోనూ అబ్బాయిలకిష్టమైన ఫ్యాషన్‌గా మారాయి. తర్వాత కనుమరుగైన ఈ స్టైల్‌ ఈమధ్యే తెరమీదికొచ్చింది. మలయాళ స్టార్‌ మమ్ముట్టి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫొటోల్లో బెల్‌బాటమ్‌తో దర్శనమిచ్చారు. బహు భాషా నాయిక శ్రుతి హాసన్‌ సైతం నలుపు రంగు బెల్‌బాటమ్‌ జీన్స్‌కి జతగా, నలుపురంగు స్వెట్‌షర్ట్‌ ధరించి తళుక్కుమంది. మరో భామ శ్రద్ధాకపూర్‌ పొడుగు చేతుల నెక్‌ టీతో బ్లాక్‌ స్టోన్‌ బెల్‌ బాటమ్‌తో ఆకట్టుకుంది. ఇదే స్టైల్‌తో కాస్త పొడవు తక్కువగా ఉండేవి ఫ్లేర్డ్‌ ప్యాంట్లు. దీపికా పదుకొణె, అలియా భట్‌, కృతి సనన్‌లు సైతం.. పలు సందర్భాల్లో ఈ ధోరణికి సై అన్నారు. అభిమాన తారలు ఈ స్టైల్‌ మళ్లీ ఫాలో అవుతుండడంతో... ఈ ఫ్యాషన్‌ వీధుల్లోకి చేరుతోంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఈ ట్రెండ్‌కి తమ ఒంటిపై చోటిస్తున్నారు.

మరింత ఆకట్టుకునేలా..

  • అమ్మాయిలు అయితే ఫ్లేర్డ్‌ ప్యాంట్‌తోపాటు టర్ట్‌ల్‌నెక్‌ టీషర్టు వేస్తే చూడటానికి పొడుగ్గా కనిపిస్తారు. పొట్టి చేతుల టీషర్టులు ధరిస్తే మరింత స్టైలిష్‌గా ఉంటారు.
  • హుందాగా కనిపించాలనుకునే కుర్రాళ్లు, కార్పొరేట్‌ ఉద్యోగులు బెల్‌బాటమ్‌కి జతగా, ముదురు రంగుల చొక్కాలు, ఫార్మల్‌ షూలు ఎంచుకుంటే సరి.
  • ఫ్యాషన్‌ని పరుగులు పెట్టించాలి అనుకునే అతివలు ఫ్లేర్డ్‌ ప్యాంట్ని క్రాప్‌ టాప్‌కి జతగా ధరించవచ్చు. బ్లేజర్‌తోనూ ఆధునికంగా కనిపిస్తారు.
  • మరింత యవ్వనంగా, స్టైల్‌గా కనిపించాలనుకునే కుర్రాళ్లు బెల్‌బాటమ్‌తోపాటు శరీరాన్ని అతుక్కుపోయేలా ఉండే నిండు చేతుల వీ-నెక్‌ టీషర్టులను ఎంచుకోవచ్చు.
  • ఫ్లేర్డ్‌ ప్యాంట్‌కి సంప్రదాయాన్ని జోడించి హుందాగా కనిపించాలనుకునే మగువలు ట్యూనిక్స్‌తో ఆ కోర్కె తీర్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు