ఏసర్‌ నుంచి ఈ-బైక్‌..

ల్యాప్‌టాప్‌ దిగ్గజ సంస్థ ఏసర్‌ ద్విచక్రవాహన తయారీలోకి దిగింది. అక్కడా, ఇక్కడా లక్ష్యం యువతే. మొదటిసారి ఎంయూవీఐ-125 4జీ అనే విద్యుత్తు ద్విచక్రవాహనంతో వస్తోంది.

Published : 16 Sep 2023 00:50 IST

ల్యాప్‌టాప్‌ దిగ్గజ సంస్థ ఏసర్‌ ద్విచక్రవాహన తయారీలోకి దిగింది. అక్కడా, ఇక్కడా లక్ష్యం యువతే. మొదటిసారి ఎంయూవీఐ-125 4జీ అనే విద్యుత్తు ద్విచక్రవాహనంతో వస్తోంది. ప్రత్యేకతలివిగో..

  • ఏసర్‌.. ఈ-బైక్‌గో అనే భారతీయ ఎలక్ట్రిక్‌ తయారీ సంస్థ భాగస్వామ్యంతో ఈ బ్యాటరీ బైక్‌లు తయారు చేస్తోంది.
  • ఈ-బైక్‌ విపణిలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే మూడు చక్రాల ట్రైక్స్‌ని సైతం అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.
  • ఈ ద్విచక్రవాహనం స్వాపబుల్‌ బ్యాటరీతో వస్తోంది. 16 అంగుళాల చక్రాలుంటాయి.
  • ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌ చేస్తే.. బండి 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
  • అత్యధిక వేగం గంటకి 75కిలోమీటర్లు. పట్టణాలు, నగరాల్లోని కుర్రకారు..

చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని