రిస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌

రోజుకో మోడల్‌.. ప్రతి మోడల్‌కో కొత్త ఫీచర్‌.. యువత ఒంట్లో భాగమైన స్మార్ట్‌ఫోన్ల కథ ఇది. ప్రస్తుతం ఉన్నవాటిని తలదన్నేలా.. మోటొరోలా కంపెనీ చేతికి వాచీలా ధరించే సెల్‌ఫోన్‌ని అందుబాటులోకి తెస్తామంటోంది.

Published : 28 Oct 2023 00:19 IST

రోజుకో మోడల్‌.. ప్రతి మోడల్‌కో కొత్త ఫీచర్‌.. యువత ఒంట్లో భాగమైన స్మార్ట్‌ఫోన్ల కథ ఇది. ప్రస్తుతం ఉన్నవాటిని తలదన్నేలా.. మోటొరోలా కంపెనీ చేతికి వాచీలా ధరించే సెల్‌ఫోన్‌ని అందుబాటులోకి తెస్తామంటోంది. ‘గ్లోబల్‌ టెక్‌ వరల్డ్‌ ఈవెంట్‌’లో ప్రదర్శితమైన ఈ నమూనా ఫోన్‌ త్వరలోనే విపణిలోకి వచ్చే అవకాశముంది.

  • ఇది పీఓఎల్‌ఈడీ ఎఫ్‌హెచ్‌డీ తెరతో పని చేస్తుంది.
  •  6.9 అంగుళాల డయాగనల్‌ ఆకారంలో ఉంటుంది.
  •  ఫోన్‌ బ్యాక్‌ ప్యానెల్‌లో ఒక ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్‌ని వాడతారు. మెటల్‌ కఫ్‌, మ్యాగ్నెటిక్‌ లింక్స్‌ ద్వారా చేతికి రిస్ట్‌ బ్యాండ్‌లా తొడుక్కోవచ్చు.
  •  యాప్‌లు ఫోన్‌ తెర కింది భాగంలో అమరి ఉంటాయి. చేతి కదలికలకు, ఉపయోగించడానికి అనుగుణంగా ఆటోమేటిగ్గా పైకి, కిందికి కదులుతాయి.
  •  వాడకందారు అభిరుచికి అనుగుణంగా కృత్రిమ మేధతో పని చేసే చాలా ఫీచర్లను జోడించారు. కింది భాగం వంగి ఉండటంతో దీన్ని ఒక స్టాండ్‌లా ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని