దివాళీకిలా.. మిలమిల

ఎల్లుండే దీపావళి. మతాబుల మెరుపులు.. దీప కాంతుల వెలుగుల పండగ ఇది. ఈ ప్రత్యేక సందర్భంలో యువత సైతం మేనికి మెరుపులు అద్దుకోవాల్సిందే.

Updated : 11 Nov 2023 03:07 IST

ఎల్లుండే దీపావళి. మతాబుల మెరుపులు.. దీప కాంతుల వెలుగుల పండగ ఇది. ఈ ప్రత్యేక సందర్భంలో యువత సైతం మేనికి మెరుపులు అద్దుకోవాల్సిందే. ఈ సమయంలో కుర్రకారు ఒంటికి ఏది నప్పుతుంది అంటే ముందు గుర్తొచ్చేవి సెక్విన్స్‌. వీటితోపాటు మెటాలిక్‌ ఎంబెలిష్‌మెంట్స్‌, క్రిస్టల్స్‌.. ఇవి అమ్మాయిల ఒంటికి మరింత శోభనిస్తాయి. సంప్రదాయమూ ఉట్టిపడాలంటే.. ఎంబ్రాయిడరీ గౌన్లు, బీడ్‌ డిజైన్ల చీరలు అక్కున చేర్చుకోవాల్సిందే. కాస్త ఆధునికత కావాలంటే పలాజో ప్యాంట్లు మరో ఆప్షన్‌. అబ్బాయిలకైతే కుర్తాలు మొదటి ప్రాధాన్యం. షేర్వానీలు, జాకెట్‌లు, ఫ్లోరల్‌ చొక్కాలు, నెహ్రూ జాకెట్లు, ధోతీ ప్యాంట్లు, ఎథ్నిక్‌ ప్రింట్లు.. ఇవన్నీ సంప్రదాయ ఫ్యాషన్లకు చిరునామాలుగా నిలుస్తాయి. దీపావళికి వీటిని ధరించి పండగని మరింత శోభాయమానం చేయండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు