Manalo Manam: అప్పుడు ప్రేమ పెళ్లి.. ఇప్పుడు మరొకరితో ప్రేమ

నా ఫ్రెండ్‌ ఒక బంధువులబ్బాయిని ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లిద్దరు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.

Updated : 05 Aug 2023 10:00 IST

  • నా ఫ్రెండ్‌ ఒక బంధువులబ్బాయిని ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లిద్దరు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. నేనూ అందుకు సాయం చేశాను. ఈ విషయం వాళ్లింట్లో తెలియదు. అయితే కొన్ని నెలలకే ఆ అబ్బాయి వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉండటం నేను కళ్లారా చూసి, నా స్నేహితురాలికి చెప్పాను. తను కోపంతో అతడికి దూరంగా ఉంటోంది. కానీ అప్పుడప్పుడు అతడు గుర్తొచ్చి ఏడుస్తోంది. నేను నిజం చెప్పి తప్పు చేశానా?

 హరిప్రియ, ఈమెయిల్‌


  •  మీ ఫ్రెండ్‌ ప్రేమ పెళ్లికి సహకరించడం అభినందనీయం. చుట్టాలబ్బాయి అయినా.. ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఎందుకు ఒప్పుకోలేదో ఒక్కసారైనా ఆలోచించారా? అతడిలో ఇబ్బందులు, లోపాలేమైనా ఉన్నాయా? లేక ఇతర కారణాలా? ముందు ఆ విషయం తెలుసుకోండి. ఇక మీరు ఆ అమ్మాయికి వాళ్ల భర్త గురించి చెప్పిన విషయానికొస్తే.. అతను వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉండటం నిజమేనా? లేక మీరేమైనా అపార్థం చేసుకున్నారేమో చెక్‌ చేసుకోండి. మీరు చెప్పింది వందశాతం నిజమే అయితే.. మీ స్నేహితురాలికి చెప్పి అలర్ట్‌ చేయడంలో తప్పేం లేదు. అయితే మీ మాట విన్న వెంటనే మీ ఫ్రెండ్‌ భర్తని దూరం పెట్టడం సమంజసం కాదు. ఇందులో నిజానిజాలేంటో ఆమె తెలుసుకోవాలి. అతడి వాదన కూడా వినాలి. పొరపాటేదైనా ఉంటే.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. కాపురం నిలబెట్టుకోవాలి. ఈ ప్రయత్నాలేం జరగకుండానే.. అతడిని దూరం పెట్టడం, తనలో తనే కుమిలిపోవడం సమంజసం కాదు. ముందు మీ స్నేహితురాలికి ధైర్యం చెప్పండి. తన భర్తతో కూర్చోబెట్టి మాట్లాడమనండి. అతడు నిజంగా తప్పు చేస్తే.. దాని ఫలితాలు ఇద్దరి జీవితాలపై ఎలా ఉంటాయో విడమరిచి చెప్పండి. అపోహలే అయితే అవి తొలగిపోయేలా ప్రయత్నం చేయమనండి. అయినా అతడు తీరు మార్చుకోకపోతే బంధం వదులుకోవడమే ఉత్తమం. ఇదంతా పెద్దలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకొమ్మని చెప్పండి.

 డా.అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని