అమ్మానాన్నల్ని చూసే..ప్రేమించాలనుకున్నా!

కథానాయికల ప్రేమకథలు కుర్రకారుని కవ్విస్తాయి. ప్రేమ గురించి వాళ్లు వెలిబుచ్చే అభిప్రాయాలు ఆసక్తి రేకెత్తిస్తాయి.

Published : 07 Oct 2023 00:35 IST

కథానాయికల ప్రేమకథలు కుర్రకారుని కవ్విస్తాయి. ప్రేమ గురించి వాళ్లు వెలిబుచ్చే అభిప్రాయాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, యువ నాయిక జాన్వీ కపూర్‌ ప్యార్‌ విషయంలో ఈమధ్యే పంచుకున్న కబుర్లివి.

  •  ప్రేమ గొప్పదే. కానీ దానికన్నా ముఖ్యమైంది సెల్ఫ్‌ లవ్‌. మనని మనం ఇష్ట పడలేనప్పుడు ఇంకొకర్ని ఎలా ప్రేమిస్తాం. మన మనసు, శరీరాన్ని నిష్కల్మషంగా ఉంచుకున్నప్పుడే ఇంకొకర్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాం. మనం ఇతరులతో రిలేషన్‌షిప్‌ ఏర్పరచుకోవడానికి ముందే మనతో మనం గొప్ప అనుబంధాన్ని పెనవేసుకోవాలి.
  •  అందం, ఆస్తి.. ఇవి నాకు ముఖ్యం కాదు. నేనిష్టపడే వ్యక్తి నిజాయతీగా ఉండాలి. తను చేసిన తప్పుల్నీ ఒప్పుకునేంత ధైర్యం కావాలి. నన్ను చాలా కేరింగ్‌గా చూసుకోవాలి. అలాంటి వాడినే ప్రేమిస్తా. డేటింగ్‌కి సిద్ధమవుతా.
  • నేను పదహారేళ్లకే ఒకబ్బాయితో ప్రేమలో పడిపోయా. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్‌ ఉన్నా.. ఒకరికొకరం చాలా అబద్ధాలు చెప్పుకునేవాళ్లం. కొన్నాళ్లకు మా విషయం అమ్మానాన్నలకు తెలిసింది. ‘ఆ వయసులో ప్రేమ సరికాదన్నారు. మీ లవ్‌లో నిజాయతీ లేద’న్నారు. అలా నా మొదటి బ్రేకప్‌ అయ్యింది. తర్వాత ఆలోచిస్తే పేరెంట్స్‌ చెప్పింది నిజమేననిపించింది
  •  ప్రేమించడం అంటే నా దృష్టిలో కొత్త బంధాలు కలుపుకోవడం. ఉన్నవాటిని వదులుకోవడం కాదు. నేను ప్రేమించినవాడు ఇంట్లోవాళ్లకీ నచ్చితేనే పెళ్లి. మావాళ్లకి నచ్చకపోతే నిర్మొహమాటంగా ‘నో’ చెబుతా. ఒకర్ని ఇష్టపడితే వాళ్లలో అన్నీ పాజిటివ్‌ గుణాలే కనిపిస్తాయి. పెద్దవాళ్లు అయితేనే వాళ్లలో లోపాలు కూడా గుర్తిస్తారు
  •  నేను ప్రేమలో పడాలి అనుకోవడానికి స్ఫూర్తి మా అమ్మానాన్నలు శ్రీదేవి, బోనీకపూర్‌లే. వాళ్లకి ఒకరంటే ఒకరికి ఇష్టం కాదు.. భక్తి. అమ్మకి నచ్చినట్టుగా ఉండేందుకు ప్రతిక్షణం ప్రయత్నించేవారు నాన్న. ఆయన మనసెరిగి ప్రవర్తించేది అమ్మ. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లది ఆదర్శ దాంపత్యం. వాళ్లను చూసినప్పుడల్లా నాకూ లవ్‌మ్యారేజ్‌ చేసుకోవాలనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని