వితౌట్ ప్లాస్టిక్.. సొగసైన సన్‌గ్లాసెస్!
ప్లాస్టిక్ వ్యర్థాలు భూమికి భారం.. మానవాళికే ప్రమాదం... కానీ వీటితోనే స్టైలిష్ సన్‌గ్లాసెస్ తయారు చేస్తున్నాడు పుణె యువకుడు అనీశ్ మల్పానీ. ఈ తరహా స్టార్టప్ ప్రపంచంలోనే మొదటిది... ఈ ఆశయం కోసం రూ.లక్షల జీతాన్నే వదులుకున్నాడు తను.
ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ముందుంటుంది. మనదేశంలో ఏడాదికి 3.4 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడుతున్నాయి. ఇందులో 29శాతాన్నే రీసైకిల్ చేస్తున్నారు. వందల ఏళ్లైనా కరిగిపోని ఈ వ్యర్థాలు మనుషులు, జంతుజాలానికి చాలా ప్రమాదకరం. ఇందులోనూ మల్టీలేయర్ ప్లాస్టిక్ (ఎంఎల్‌పీ)తో ముప్పు మరింత ఎక్కువ. చిప్స్ ప్యాకెట్లు, చాక్లెట్ రేపర్లు, జ్యూస్ కార్టన్లు, టూత్‌పేస్ట్ ట్యూబ్‌లు, షాంపూ షాచెట్‌లు.. వీటిన్నింటినీ ఎంఎల్‌పీ అంటారు. వీటిని రీసైక్లింగ్ చేయడం అత్యంత కష్టం. అందుకే చెత్త ఏరుకునేవారు సైతం ఈ వ్యర్థాలను పట్టించుకోరు. అలాంటి వాటిని రీసైకిల్ చేసి ‘వితౌట్’ అనే బ్రాండ్‌తో సొగసైన సన్‌గ్లాసెస్ తయారు చేయిస్తున్నాడు అనీష్. దీనికోసం ఒక ప్రత్యేకమైన సాంకేతికతను అభివృద్ధి చేశాడు.
వ్యర్థాల నుంచి అర్థవంతమైన ఈ ఉత్పత్తులు.. ఒక్కరోజులో సాధ్యమేం కాలేదు. దీని వెనక ఏళ్లకొద్దీ ఆలోచన, శ్రమ ఉంది. అనీష్ అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక బహుళజాతి కంపెనీలో నెలకు ఆరంకెల వేతనంతో పని చేసేవాడు. కానీ పర్యావరణ ప్రేమికుడైన తను రోజురోజుకీ పెచ్చరిల్లుతున్న కాలుష్యాన్ని చూస్తూ తల్లడిల్లిపోయేవాడు. చివరికి ఇలా బాధ పడటం కాదు.. ఆచరణలోకి దిగాల్సిన సమయం వచ్చిందని భావించి, 2015లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు. కెన్యా, గ్వాటెమాలా వెళ్లి సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో కలిసి కొన్నాళ్లు పని చేశాడు. 2017లో భారత్ తిరిగొచ్చాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఒక వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పని చేసి ప్రాక్టికల్ అనుభవం సంపాదించాడు. ప్లాస్టిక్ వ్యర్థాలతో జనాలకు ఉపయోగపడే ఉత్పత్తులు చేయాలనే ఉద్దేశంతో 2020లో ‘ఆశయ’ అనే అంకుర సంస్థ ప్రారంభించాడు. ఎంఎల్‌పీ వ్యర్థాలతో ఏం చేయవచ్చో.. కనుక్కోవడానికి ఇంక్యుబేటర్‌లు, విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేశాడు. రీసైకిల్ చేసే యంత్రాలు, ల్యాబ్‌లు ప్రారంభించి వేలకొద్దీ ప్రయోగాలు చేయించాడు. ఏడాదిన్నర పాటు చేసిన కష్టం ఫలించి సానుకూలమైన మెటీరియల్‌ని ఉత్పత్తి చేయగలిగాడు. దీనితోనే కుర్రకారు ధరించేలా స్టైలిష్ కళ్లద్దాలు తయారు చేశాడు. మొదటి ఉత్పత్తి మంచి సక్సెస్ కావడంతో ఇదే ఊపుతో కొత్త యాక్సెసరీలు రూపొందించే పనిలో ఉన్నాడు అనీశ్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Vitapu-Botsa: విఠపు పరీక్షలో.. బొత్సకు 2 మార్కులే!
-
Ap-top-news News
AP Assembly: సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే సస్పెండ్ అయినట్లే.. రూలింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు