క్రిస్మస్ కాంతులు
సొగసులమ్మకే పాఠాలు నేర్పించేలా నిత్యం ముస్తాబై కనిపించేవారే సినీ తారలు. సమయం, సందర్భం వచ్చిందంటే మరింత దూకుడు పెంచేస్తుంటారు. వాళ్ల ఫ్యాషన్ ప్రదర్శనలకు ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లాంటి వేదికలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. అన్నట్టు ఇది క్రిస్‌మస్ సీజన్. దీన్ని మాత్రం వదులుకుంటారా? కొత్త కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌తో అంతర్జాలంలో సెగలు పుట్టిస్తున్నారు. ఇంతకీ ఈ పండక్కి ఎవరు ఎలాంటి ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు అంటే..
* కియారా అడ్వాణీ అంటేనే సొగసులకు చిరునామా. కొత్త ఫ్యాషన్ ట్రెండ్ ఏది వచ్చినా ముందు తను ఆచరిస్తుంది. అలాంటి కియారా ఈ పండగకి ఎరుపు రంగు కో-ఆర్డ్ సెట్‌తో చెలరేగిపోతున్నానంటూ చెబుతోంది. క్రాప్‌టాప్, పొడవాటి స్కర్టుతో ఆకట్టుకునేలా ఔట్‌ఫిట్ సిద్ధం చేసుకుంది.
* బొద్దుగుమ్మ హ్యుమా ఖురేషీ ఈమధ్యకాలంలో స్టైల్‌తో బాగా సందడి చేస్తోంది. ఈ క్రిస్మస్‌కి నా స్టైల్ ఇదే అంటూ ఇన్‌స్టాలో ప్యాంట్‌సూట్ ఫొటోలు పెట్టేసింది. ఇందులో నిండు చేతుల జాకెట్, చీలమండ వరకు ఉన్న లెగ్గింగ్‌తో హొయలు పోయింది.
* ఇప్పటికి స్టార్ హోదా అందుకోకపోయినా.. ముందు నుంచీ ఫ్యాషన్ ఐకాన్‌గానే గుర్తింపు పొందిన భామ సారా అలీఖాన్. తను ఎరుపు రంగు బాడీకాన్‌తో మురిపించింది. దీనిపై అదే రంగు జాకెట్ వేసి క్రిస్మస్ పార్టీకి సిద్ధమన్నట్టుగా ముస్తాబైంది.
* పెళ్లయ్యాక సొగసుల జోరు మరింత పెంచింది కత్రినా కైఫ్. ‘ఈ క్రిస్మస్‌కి ఇదే నా ఔట్‌ఫిట్’ అని ఓ ఫొటో పంచుకుంది. ఈ కౌల్ నెక్ షిమ్మరీ గౌను కత్రినా అందాన్ని మరింత ఇనుమడింపజేస్తోంది. మెటాలిక్ సిల్వర్ రంగు మెరుపులకు అభిమానులు ఫిదా అంటున్నారు.
* ముందునుంచే సూపర్ మోడల్.. ఆపై బాలీవుడ్ స్టార్.. మరి దీపికా పదుకొణె ఈ సొగసుల బరిలో దిగకుండా ఉంటుందా? ఎరుపురంగు పవర్‌సూట్‌లో తన స్టైల్ పవరెంతో చూపించింది. దీనికి జతగా ఫ్లేర్డ్ ప్యాంట్, ఓవర్ సైజ్డ్ బ్లేజర్‌తో ర్యాంప్‌వాక్ చేస్తున్న సూపర్‌మోడల్‌నే తలపించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్
-
Ts-top-news News
ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ పెంపు వడ్డన?