logo

చక్రత్తాళ్వారుకు చక్రస్నానం

శ్రీ పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శనివారం ఉదయం పల్లకీలో స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా పద్మసరస్సు వద్దకు తీసుకొచ్చారు. అర్చకస్వాములు ఉత్సవమూర్తులకు, సుదర్శన చక్రానికి సహస్రధార కలశాభిషేకం చేసి

Updated : 22 May 2022 05:52 IST

బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం


చక్రస్నానం నిర్వహిస్తున్న దృశ్యం

నారాయణవనం: శ్రీ పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శనివారం ఉదయం పల్లకీలో స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా పద్మసరస్సు వద్దకు తీసుకొచ్చారు. అర్చకస్వాములు ఉత్సవమూర్తులకు, సుదర్శన చక్రానికి సహస్రధార కలశాభిషేకం చేసి స్నానం చేయించగానే భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. సాయంత్రం ధ్వజావరోహణం నిర్వహించారు. తితిదే డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్‌ ఏకాంబరం, ఆలయాధికారి నాగరాజు, అర్చకులు, తితిదే అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని