Andhra News: విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: గుడివాడ అమర్నాథ్‌

దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ 10 అంశాల్లో పాల్గొంటుందని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి.. రాష్ట్ర వనరులపై ఒక పెవిలియన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖలో ఐటీ అభివృద్ధి

Published : 19 May 2022 02:15 IST

విశాఖ: దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ 10 అంశాల్లో పాల్గొంటుందని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి.. రాష్ట్ర వనరులపై ఒక పెవిలియన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖలో ఐటీ అభివృద్ధి దిశగా దావోస్‌లో ప్రస్తావిస్తామన్నారు. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. కొవిడ్‌ వల్ల ఓ వైపు ఐటీ, మరో వైపు పారిశ్రామికంగా ఇబ్బందులు పడ్డామన్నారు. ఈ క్రమంలో ఎమ్‌ఎస్‌ఎంఈలను అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారని.. దీనిపై దావోస్‌లో ప్రస్తావించనున్నట్లు మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని