Andhra News: ప్రత్యేకహోదా ఇస్తామంటేనే ఎవరికైనా మద్దతు ఇస్తాం: పేర్ని నాని

‘ఎన్నికలయ్యాక కేంద్రంలో మా ఎంపీల సంఖ్యా బలం అవసరం అనుకునే ఏ కూటమికైనా సరే మద్దతునిస్తాం. అంతకంటే ముందుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ కూటమి కాగితంపై రాసి ఇస్తేనే మా మద్దతునిస్తాం...’ అని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాకు ఎవరితోనూ పొత్తులు అవసరం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. రాజకీయ వ్యూహకర్త...

Updated : 26 Apr 2022 11:39 IST

ఈనాడు, అమరావతి:  ‘ఎన్నికలయ్యాక కేంద్రంలో మా ఎంపీల సంఖ్యా బలం అవసరం అనుకునే ఏ కూటమికైనా సరే మద్దతునిస్తాం. అంతకంటే ముందుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ కూటమి కాగితంపై రాసి ఇస్తేనే మా మద్దతునిస్తాం...’ అని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాకు ఎవరితోనూ పొత్తులు అవసరం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ వైకాపాను కాంగ్రెస్‌తో కలిసేలా దిశానిర్ధేశం చేస్తున్నారా అని విలేకరులు అడగ్గా.. ‘ప్రశాంత్‌ కిషోర్‌ మా పార్టీకి కన్సల్టెంట్‌ మాత్రమే. ఎన్నికల్లో ఆయన ఆలోచనలు, తెలివితేటలను మాత్రమే వాడుకుంటాం. వైకాపాను ఎవరూ శాసించలేరు...’అని  సమాధానమిచ్చారు. ‘పవన్‌కల్యాణ్‌ చంద్రబాబుకు బానిస. చిరంజీవి విలువలు ఉన్న వ్యక్తి. చంద్రబాబుపై చూపిస్తున్న ప్రేమను పవన్‌ చిరంజీవిపై చూపిస్తే బాగుండేది...’అని వ్యాఖ్యానించారు. ‘మంత్రి పదవి కన్నా నాకు సీఎం జగన్‌ ఇస్తున్న గౌరవమే ఎక్కువ. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తా...’ అని పేర్నినాని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని