ఆ ఎమ్మెల్యేలకు అనర్హత వర్తించదా?

‘పార్టీ గుర్తుపై గెలిచి అదే పార్టీని విమర్శిస్తున్నానని తనపై అనర్హత వేటు వేయాలని కోరుతున్న వైకాపాకు వేరే పార్టీల గుర్తులపై గెలిచి తమ కండువా కప్పుకొని తిరుగుతున్న ఎమ్మెల్యేలు కనిపించలేదా’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు

Published : 24 May 2022 03:58 IST

వంశీ, మద్దాలి గిరి, బలరాం, వాసుపల్లి, రాపాకలు ఏ పార్టీ నుంచి గెలిచి ఏ కండువాలు వేసుకుంటున్నారు?

వైకాపాకు రఘురామకృష్ణరాజు సూటి ప్రశ్న

ఈనాడు, దిల్లీ: ‘పార్టీ గుర్తుపై గెలిచి అదే పార్టీని విమర్శిస్తున్నానని తనపై అనర్హత వేటు వేయాలని కోరుతున్న వైకాపాకు వేరే పార్టీల గుర్తులపై గెలిచి తమ కండువా కప్పుకొని తిరుగుతున్న ఎమ్మెల్యేలు కనిపించలేదా’ అని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. సోమవారం మార్గాని భరత్‌ తనపై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ‘తెదేపా తరఫున గెలిచిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌, జనసేన టికెట్‌పై గెలిచిన రాపాక వరప్రసాద్‌లు సొంత పార్టీలను వదిలి వైకాపా పంచన చేరారు. వీరందరూ వైకాపా కండువాలు కప్పుకొని నిస్సిగ్గుగా తిరుగుతున్నా అనర్హత వేటెందుకు వేయలేదో చెప్పాలి. ఒక పార్టీ తరఫున గెలిచినవారు అమ్ముడుపోయి వేరే పార్టీ కోసం పని చేస్తున్నట్లు మార్గాని భరత్‌ సత్యవచనాలు పలికారు. మరి ఈ ఎమ్మెల్యేలందర్నీ వైకాపా కొని, వారి సొంత పార్టీలను డ్యామేజీ చేయడానికి నియమించుకుందా? ఎన్నికల ముందు మేనిఫెస్టోను చూసి ప్రజలు ఓట్లేయడంవల్లే పార్టీ అధికారంలోకి వచ్చింది.. దాన్నే ప్రభుత్వం అమలు చేస్తోందంటున్నారు. పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఎన్నో హామీలను ప్రభుత్వం తుంగలోకి తొక్కిందనే విషయాన్ని నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాను. అంతే తప్ప ఎవరి మీదా విమర్శలు చేయడం లేదు. మేనిఫెస్టోలోని అంశాల్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నాను తప్ప పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని