దిశ బిల్లుపై ఏపీ అభిప్రాయాలు కోరాం

దిశ బిల్లుపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని మహిళా భద్రతా విభాగం వ్యక్తంచేసిన అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి వివరణలు కోరామని, అవి ఇంకా రావాల్సి ఉందని ఆ శాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్‌ మిశ్ర ...

Updated : 02 Dec 2021 06:13 IST

ఈనాడు, దిల్లీ: దిశ బిల్లుపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని మహిళా భద్రతా విభాగం వ్యక్తంచేసిన అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి వివరణలు కోరామని, అవి ఇంకా రావాల్సి ఉందని ఆ శాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్‌ మిశ్ర తెలిపారు. బుధవారం రాజ్యసభలో వైకాపా ఎంపీ పరిమళ్‌ నత్వానీ అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానమిచ్చారు. ‘ఏపీ దిశ-క్రిమినల్‌ లా (ఆంధ్రప్రదేశ్‌ సవరణ) బిల్లు-2019, ఏపీ దిశ (స్పెషల్‌ కోర్ట్స్‌ ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ ఎగెనెస్ట్‌ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌) బిల్లు-2020లు... రాష్ట్రపతి అనుమతి కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి కేంద్ర హోంశాఖకు అందాయి. నిబంధనల మేరకు వీటిపై నోడల్‌ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లతో సంప్రదింపుల ప్రక్రియ మొదలుపెట్టాం. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ రెండు బిల్లులపై తన అభిప్రాయాలు, వ్యాఖ్యలు పంపింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును న్యాయశాఖ సలహా కోసం పంపాం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ దిశ-క్రిమినల్‌ లా (ఆంధ్రప్రదేశ్‌ అమెండ్‌మెంట్‌) బిల్లు-2019పై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మహిళా భద్రతా విభాగం వ్యక్తంచేసిన అభిప్రాయాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వివరణ కోసం ఎదురుచూస్తున్నాం’’ అని కేంద్ర మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని