మహిళల స్వావలంబనకు 2 మిలియన్‌ డాలర్లు

మహిళల ఆర్థిక స్వావలంబనతోపాటు వారిలో నాయకత్వ లక్షణాలను పెంచేలా అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు హైఫర్‌ ఇంటర్నేషనల్‌, కార్గిల్‌, వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపాయి. దీని కోసం సుమారు 2మిలియన్‌ డాలర్లను సాయంగా

Published : 21 Jan 2022 05:36 IST

అనంత, తూర్పుగోదావరిలలో పెరటి కోళ్ల పెంపకానికి సాయం
హైఫర్‌ ఇంటర్నేషనల్‌, కార్గిల్‌, వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: మహిళల ఆర్థిక స్వావలంబనతోపాటు వారిలో నాయకత్వ లక్షణాలను పెంచేలా అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రాజెక్టును చేపట్టనున్నట్లు హైఫర్‌ ఇంటర్నేషనల్‌, కార్గిల్‌, వాల్‌మార్ట్‌ ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపాయి. దీని కోసం సుమారు 2మిలియన్‌ డాలర్లను సాయంగా అందిస్తామని పేర్కొన్నాయి. ‘ఈ ప్రాజెక్టు కింద పెరటి కోళ్ల పెంపకానికి సహకరిస్తాం. దీని ద్వారా మహిళల ఆర్థిక సుస్థిరతతోపాటు స్వల్ప వ్యవధిలో గణనీయమైన లాభాలు గడించడానికి అవకాశముంది. ఈ 2జిల్లాల్లోని రైతు ఉత్పత్తి సంఘాల (ఎఫ్‌పీవో) ద్వారా మహిళలకు కొత్త ఆదాయ మార్గాలు, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకునేలా కార్యక్రమాలను రూపొందిస్తాం. ఈ ప్రాజెక్టును 2018లో ఝార్ఖండ్‌, ఒడిశాలలో ప్రారంభించాం. ఆ తర్వాత ఏపీలో రెండు జిల్లాల్లోని 8ఎఫ్‌పీవోల పరిధిలో అమలుకు నిర్ణయించాం. ఈ ప్రాజెక్టు కింద దేశంలో 25 మిలియన్‌ డాలర్లను 2018నుంచి ఐదేళ్లలో ఖర్చు చేయాలని నిర్ణయించాం’ అని తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని