పోస్టుమార్టం నివేదిక అందగానే తదుపరి చర్యలు

ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవరు సుబ్రహ్మణ్యం మృతి కేసు దర్యాప్తు చేస్తున్నామని.. పోస్టుమార్టం నివేదిక అందగానే తదుపరి చర్యలు తీసుకుంటామని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో

Published : 23 May 2022 05:04 IST

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవరు సుబ్రహ్మణ్యం మృతి కేసు దర్యాప్తు చేస్తున్నామని.. పోస్టుమార్టం నివేదిక అందగానే తదుపరి చర్యలు తీసుకుంటామని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యలో ఆయన నెల్లూరులోని పోలీసు అతిథిగృహంలో బసచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నేరాల కట్టడిలో భాగంగా నైట్‌బీట్‌ను బలోపేతం చేసి నేరచరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచామని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా 25 మోడల్‌ స్టేషన్లను నిర్మిస్తామన్నారు. ఏదైనా నేరం జరిగితే రోజుల వ్యవధిలోనే విచారణ పూర్తిచేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు న్యాయవ్యవస్థ సహకారంతో దోషులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తున్నామని తెలిపారు. కేసుల పరిశోధనల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు. మహిళల భద్రతకు  పెద్దపీట వేస్తున్నామని, కొత్త జిల్లాల్లో   పోలీసు కార్యాలయాలను దశలవారీగా నిర్మిస్తామని పేర్కొన్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, నిరంతర తనిఖీలతో కొంతవరకు తగ్గిందన్నారు. ఆయనతో పాటు జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయరావు తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని