బెదిరింపులకు వెరవని మండువవారిపాలెం

ఒంగోలు మండలం పరిధిలోని మండువవారిపాలెం.. 1,074 మంది జనాభా కలిగిన ఓ చిన్న గ్రామం. తెలుగుదేశం పార్టీ మహానాడుకు వేదికగా నిలవడంతో ఇప్పుడు ఆ

Published : 27 May 2022 05:25 IST

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం: ఒంగోలు మండలం పరిధిలోని మండువవారిపాలెం.. 1,074 మంది జనాభా కలిగిన ఓ చిన్న గ్రామం. తెలుగుదేశం పార్టీ మహానాడుకు వేదికగా నిలవడంతో ఇప్పుడు ఆ ఊరు ప్రత్యేకతను సంతరించుకుంది. ఒంగోలులో మహానాడు కోసం ఆ పార్టీ నేతలు రెండు మూడు ప్రాంతాలను పరిశీలించారు. గుంటూరు రోడ్డులోని 83 ఎకరాల వ్యవసాయ భూములు అనువుగా ఉన్నట్లు భావించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌.. ఆ గ్రామ నాయకులు, రైతులతో మాట్లాడారు. వారు అంగీకరించడంతో వేదిక ఖరారైంది. 30 మంది రైతులు మహానాడుకు భూములిచ్చారని తెలిసి స్పెషల్‌ బ్రాంచ్‌, ఇంటెలిజెన్స్‌ పోలీసులు వచ్చి వివరాలను సేకరించారు. అయినా వారు బెదరలేదు. ముఖ్యంగా యువత, స్థానిక పెద్దలు పట్టుదలగా నిలిచారు. దీంతో వేదిక ఖరారైంది. ఆ రైతులకు కృతజ్ఞత తెలిపేందుకు చంద్రబాబు వారితో సమావేశం కానున్నారు. అనంతరం అక్కడి నుంచే సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఇందుకోసం బ్రహ్మయ్యకుంట డొంక మీదుగా ఉన్న రహదారిని అభివృద్ధి చేశారు. ‘ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకుని మా గ్రామంలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ మా కుటుంబీకులు, బంధువుల భూమే ఎక్కువగా ఉంది. పార్టీ నాయకులు సంప్రదించగానే గ్రామస్థులతో మాట్లాడి ఒప్పించాను’ అని సర్పంచి మండువ వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని