నాయీబ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కాపాడారు

నాయీ బ్రాహ్మణులను వారి సామాజికవర్గాన్ని కించపరిచేలా వినియోగించే పదాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆ సామాజిక వర్గ ప్రతినిధులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌

Published : 19 Aug 2022 05:08 IST

సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ప్రతినిధులు

ఈనాడు, అమరావతి: నాయీ బ్రాహ్మణులను వారి సామాజికవర్గాన్ని కించపరిచేలా వినియోగించే పదాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆ సామాజిక వర్గ ప్రతినిధులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సిద్ధవటం యానాదయ్య, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి కోటేశ్వరరావు, నాయీ బ్రాహ్మణ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు జి.రామదాసు, ప్రతినిధులు కె.శ్రీదేవి, నందిని, తదితరులు గురువారం ముఖ్యమంత్రి జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడారంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని