సీఎంకు పవిత్ర జలం అందజేసిన హజ్‌ కమిటీ

హజ్‌ యాత్ర ముగిసిన సందర్భంగా అక్కడ నుంచి తీసుకువచ్చిన జమ్‌ జమ్‌ పవిత్ర జలాన్ని రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు.

Published : 27 Sep 2022 05:25 IST

ఈనాడు, అమరావతి: హజ్‌ యాత్ర ముగిసిన సందర్భంగా అక్కడ నుంచి తీసుకువచ్చిన జమ్‌ జమ్‌ పవిత్ర జలాన్ని రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. సోమవారం సీఎంను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఈ జలాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మైనారిటీలకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ప్రతినిధులు వెల్లడించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో హజ్‌ కమిటీ ఛైర్మన్‌ బీఎస్‌ గౌస్‌ లాజమ్‌, ఎమ్మెల్సీలు ఇషాక్‌ బాషా, రుహుల్లా, కమిటీ సభ్యులు మునీర్‌ బాషా, ఇమ్రాన్‌, ఇబాదుల్లూ, ఖాదర్‌, ముఫ్తిబాసిత్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని